వీరు క‌ల‌హాల‌కు దూరంగా ఉండ‌డం మేలు

Daily Horoscope for 2-09-2022.చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వస్తులాభాలు పొందుతారు.

By జ్యోత్స్న  Published on  2 Sep 2022 1:49 AM GMT
వీరు క‌ల‌హాల‌కు దూరంగా ఉండ‌డం మేలు

మేషం: చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వస్తులాభాలు పొందుతారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్థులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి కొత్త పనులు చేపట్టి విజయం సాధిస్తారు.

వృషభం: విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి.

మిధునం: చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. దూరపు బంధువులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది నూతన రుణయత్నాలు చేస్తారు.

కర్కాటకం: అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. ఇంటాబయట మానసిక ఒత్తిడులు అధికామౌతాయి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నూతన రుణయత్నాలు ఫలించవు.చేపట్టిన పనుల్లో తొందరపాటు మంచిది కాదు.

సింహం: నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి మొండి బాకీలు వసూలు చేసుకోగలుగుతారు. ఉద్యోగులు అధికారుల అండదండలతో ముందుకు సాగుతారు.అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

కన్య: వృధా ఖర్చులు పెరుగుతాయి ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక వ్యవహారాలు కొంత నిరాశ పరుస్తాయి. వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది వృత్తి ఉద్యోగాల్లో స్థానచలన సూచనలు ఉన్నవి ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు.కొన్ని వ్యవహారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది.

తుల: వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఆర్థికంగా అవసరానికి ధన సహాయం లభిస్తుంది సమాజంలో పలుకుబడి పెరుగుతుంది.చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.

వృశ్చికం: ఉద్యోగాలలో అధికారుల నుండి ఒత్తిడులు పెరుగుతుంది. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి వృత్తి వ్యాపారాల్లో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు.అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధుమిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు.

ధనస్సు: దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు.వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది.ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

మకరం: దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది.ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

కుంభం: ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు.వ్యాపారపరంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కుటుంబసభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి ముఖ్యమైన పనులు వాయిదా వేయుట మంచిది ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు ఉంటాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

మీనం: బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు కొన్ని వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలసిరావు. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి.

Next Story