ఈ రాశి వారు అన్ని విష‌యాల్లో అప్ర‌మత్తంగా ఉండాలి

Daily Horoscope for 19-11-2022.ఉద్యోగులకు అదనపు పనిభారం తప్పదు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

By జ్యోత్స్న  Published on  19 Nov 2022 1:58 AM GMT
ఈ రాశి వారు అన్ని విష‌యాల్లో అప్ర‌మత్తంగా ఉండాలి

మేషం: ఉద్యోగులకు అదనపు పనిభారం తప్పదు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. బంధు వర్గం వారితో అకారణ వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలలో పెట్టుబడులు అందడంలో ఆలస్యం అవుతుంది.

వృషభం: ఆదాయం అంతగా కనిపించదు. దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు తప్పవు. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

మిధునం: చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విలువైన వస్తువులు సేకరిస్తారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అనుకుంటారు. అందరిలోనూ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. గృహమున ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.

కర్కాటకం: ఇంటా బయట అకారణ వివాదాలు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. రుణదాతల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు స్థాన చలన సూచనలు ఉన్నవి. ఆలయ దర్శనాలు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి.

సింహం: దూరప్రాంతాల నుంచి శుభకార్య ఆహ్వనాలు అందుతాయి. సమాజంలో ప్రముఖ వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ధన పరంగా ఇబ్బందులు తొలగుతాయి. ఉద్యోగస్థులకు అధికారుల నుండి శుభవార్తలు అందుతాయి.

కన్య: వ్యాపారాలలొ స్వల్ప లాభాలు అందుకుంటారు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. నిరుద్యోగ ప్రయత్నాలు విఫలమవుతాయి. భూ వివాదాలు మానసికంగా చికాకు కలిగిస్తాయి. ఆదాయ మార్గాలు తగ్గుతాయి.

తుల: ఉద్యోగాలలో సహోద్యోగులతో చక్కగా వ్యవహరిస్తారు. నూతన పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. పాత మిత్రులను కలుసుకుంటారు. ఆర్థికంగా పురోగతి కలుగుతుంది. వ్యాపారస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి.

వృశ్చికం: స్థిరాస్తి కొనుగోలు యత్నాలు కలిసివస్తాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి.

ధనస్సు: దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలలో ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి. దూరప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి. స్నేహితులతో కొన్ని వ్యవహారాలలో విభేదాలు కలుగుతాయి.

మకరం: ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలనే తగిన విశ్రాంతి ఉండదు. ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు తప్పవు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపారాలలో భాగస్వాములతో జాగ్రత్తగా వ్యవహరించాలి. స్థిరస్తి విషయమై సోదరులతో వివాదాలు కలుగుతాయి.

కుంభం: వ్యాపార లావాదేవీలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు తెలుస్తాయి. ఉద్యోగులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. విలువైన వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

మీనం: వ్యాపారాలలో కీలక నిర్ణయాలతో ముందుకు సాగుతారు. నిరుద్యోగ యత్నాలలో విజయం సాధిస్తారు. విలువైన వస్తులాభాలు పొందుతారు. ఉద్యోగాలలో ఆశించిన పదోన్నతులు పొందుతారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.

Next Story