ఈ రోజు రాశి ఫ‌లం ఎలా ఉందంటే..?

Daily horoscope for 19-08-2022.దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి

By జ్యోత్స్న  Published on  19 Aug 2022 1:28 AM GMT
ఈ రోజు రాశి ఫ‌లం ఎలా ఉందంటే..?

మేషం : దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు.బంధు మిత్రులతో గృహమున సందడిగా గడుపుతారు.చేపట్టిన పనులు నిదానంగా పూర్తిచేస్తారు.

వృషభం : వ్యాపార వ్యవహారాలలో స్వంత ఆలోచనతో ముందుకు సాగడం మంచిది. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. చేపట్టిన పనులు వాయిదా వేయడం మంచిది ఉద్యోగమున పనిభారం తప్పదు. విద్యార్థుల శ్రమకు తగిన ఫలితం కనిపించదు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.

మిధునం : కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. సన్నిహితుల నుండి ఊహించని ధన సహాయం అందుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కలసివస్తాయి.నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ది కలుగుతుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.

కర్కాటకం : వ్యాపారమున ఆశించిన అభివృద్ధి కలుగుతుంది ఇంటా బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి చేపట్టిన వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తవుతాయి. ఆర్థికంగా కొంత పురోగతి కలుగుతుంది.నూతన వాహనం కొనుగోలు చేస్తారు.నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి.

సింహం : వృత్తి వ్యాపారములలో కొత్త సమస్యలు ఎదురవుతాయి. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆదాయ విషయంలో నిరాశ తప్పదు. ఉద్యోగమున చిన్నపాటి వివాదాలుంటాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

కన్య : బంధు వర్గం వారితో మాట పట్టింపులుంటాయి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అధిగమించి ముందుకు సాగుతారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఆకస్మికంగా స్థానచలనాలుంటాయి. నూతన ఋణ ప్రయత్నాలు కొంతవరకు కలిసివస్తాయి.

తుల : పాతమిత్రుల కలయిక సంతోషం కలిగిస్తుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. సమాజంలో ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపార ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.కుటుంబ సభ్యుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు.

వృశ్చికం : నూతన వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు. ఆప్తులతో సఖ్యతగా వ్యవహారిస్తారు. స్ధిరాస్తి క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుతాయి బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

ధనస్సు : వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధికమవుతాయి. కుటుంబ సభ్యులతో ఊహించని కలహాలు కలుగుతాయి.

మకరం : ఆప్తుల నుండి అందిన సమాచారం కొంత మానసికంగా బాధిస్తుంది. దూర ప్రయాణాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది.పాతరుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగ విషయంలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.

కుంభం : భూ సంబంధిత క్రయవిక్రయాలలో ఊహించని లాభాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఆప్తులతో గృహమున ఆనందంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికామౌతుంది. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి.

మీనం : ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహారించాలి. ఉద్యోగ విషయంలో తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టపడతారు. పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. చుట్టు పక్కలవారితో స్థిరస్తి వివాదాలు కలుగుతాయి.

Next Story