ఈ రాశుల వారు ప‌ట్టింద‌ల్లా బంగార‌మే

Daily horoscope for 17-11-2022.మిత్రులతో చిన్నపాటి విభేదాలు ఉంటాయి.

By జ్యోత్స్న  Published on  17 Nov 2022 1:46 AM GMT
ఈ రాశుల వారు ప‌ట్టింద‌ల్లా బంగార‌మే

మేషం: మిత్రులతో చిన్నపాటి విభేదాలు ఉంటాయి. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి. సంతాన ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పవు. శ్రమాదిక్యాతతో దూరప్రయాణాలు చెయ్యవలసిన వస్తుంది. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి.

వృషభం: చేపట్టిన పనులలో తొందరపాటు మంచిదికాదు. ప్రయాణాలలొ మార్గావరోధాలు కలుగుతాయి. ఉద్యోగాలలో ఊహించని స్థానచలనాలు కలుగతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రత్యర్థుల నుంచి ధనపరంగా ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి.

మిధునం: కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. దూరప్రాంతాల బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పురోగతి కలుగుతుంది. చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు.

కర్కాటకం: బంధువులతో ఆకారణ విభేదాలు కలుగుతాయి. ఆదాయనికి మించి ఖర్చులుంటాయి. నూతన రుణ యత్నాలు చేస్తారు. మానసిక ప్రశాంతతకు ఆలయ దర్శనాలు చేసుకుంటారు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు చికాకు పరుస్తాయి.

సింహం : చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలు చర్చిస్తారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తొలగుతాయి. నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

కన్య: స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా వేస్తారు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. చేపట్టిన పనులలో శ్రమధిక్యత పెరుగుతుంది. ఉద్యోగమున అదనపు బాధ్యతలు పెరుగుతాయి. మిత్రులతో కలహా సూచనలున్నవి. వ్యాపారాలు నిరాశాజనకంగా సాగుతాయి.

తుల: వ్యాపారాలు సజావుగా సాగుతాయి. సంతాన విద్యా విషయాలలొ శుభవార్తలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. రాజకీయ సభ, సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి.

వృశ్చికం: వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.

ధనస్సు : ముఖ్యమైన పనులలో కార్యాటంకములు కలుగుతాయి. సోదరులతో స్థిరస్తి వివాదాలు కలుగుతాయి. ప్రయాణాలు వాయిదా పడుతాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగులకు అదనపు పని బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది.

మకరం: వృథా ఖర్చులు పెరుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యయప్రయాసలతో కానీ పనులు పూర్తి కావు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు కలుగుతాయి. ఉద్యోగులకు అధికారుల నుండి విమర్శలు తప్పవు. భాగస్వామ్య వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.

కుంభం: కీలక సమయంలో సన్నిహితుల సాయం అందుతుంది. జీవిత భాగస్వామి నుంచి ఆకస్మిక ధనలాభాలు పొందుతారు. ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశములు లభిస్తాయి.

మీనం: వృత్తి వ్యాపారాలలో అధిక లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. విందువినోదాది కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. ఆదాయమార్గాలు పెరుగుతాయి.

Next Story