ఈ రోజు దినఫలాలు ఎలా ఉన్నాయంటే..?
Daily horoscope for 17-10-2022.సోదరులతో వివాదాలు పరిష్కారమౌతాయి. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి.
By జ్యోత్స్న Published on 17 Oct 2022 1:38 AM GMTమేషం:సోదరులతో వివాదాలు పరిష్కారమౌతాయి. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహనిస్తాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది.
వృషభం: కీలక వ్యవహారాలలో ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేస్తారు. చేపట్టిన పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. దైవచింతన పెరుగుతుంది. రుణదాతల నుండి ఒత్తిడులు పెరుగుతాయి. ఆరోగ్య పరంగా చికాకులు తప్పవు.
మిధునం: ఆర్థిక పరంగా పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగండం మంచిది. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులుంటాయి. వ్యాపారమున ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.
కర్కాటకం: ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధువులతో మాటపట్టింపులుంటాయి. చేపట్టిన పనుల్లో తొందరపాటు పనిచేయదు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగమున అధికారుల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది వృధా ఖర్చులు పెరుగుతాయి. నిరుద్యోగుల కష్టం ఫలించదు.
సింహం: కొన్ని వ్యవహారాలలో అవరోధాలు కలిగిన ముందుకు సాగుతారు. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు.సంఘంలో పలుకుబడి పెరుగుతుంది.
కన్య: కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది వ్యాపార, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. దీర్ఘకాలిక ఋణ భారం తొలగుతుంది ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. సంతాన విద్యాయత్నాలు సానుకూలమవుతాయి.
తుల: కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు.బంధు, మిత్రులతో తగాదాలు కలుగుతాయి. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి, వ్యాపారాలు కొంత మందకోడిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
వృశ్చికం: వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు తప్పవు. ముఖ్యమైన పనులలో జాప్యం కలుగుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. రుణదాతల నుంచి ఒత్తిడి పెరిగి మానసిక సమస్యలు కలుగుతాయి.
ధనస్సు: దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన కార్యక్రమాలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపార, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. పాత విషయాలు గుర్తుకు వస్తాయి.
మకరం: నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు పొందుతారు. చేపట్టిన పనులలో ఆటంకాలు అదిగమిస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలువైన వస్తు లాభలు అందుతాయి.
కుంభం: వృత్తి, వ్యాపారాలలో ఊహించని మార్పులుంటాయి. చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. బంధు వర్గంతో విభేదాలు తప్పవు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి.
మీనం: వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు అనుకోని ఖర్చులు చెయ్యవలసి వస్తుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు.