నేటి దిన ఫ‌లాలు.. అనారోగ్య సమస్యలు, మిత్రులతో ఊహించని కలహాలు

Daily horoscope for 17-09-2022.నేత్ర ఉదర అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి.

By జ్యోత్స్న  Published on  16 Sep 2022 11:30 PM GMT
నేటి దిన ఫ‌లాలు.. అనారోగ్య సమస్యలు, మిత్రులతో ఊహించని కలహాలు

మేషం: నేత్ర ఉదర అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి. మిత్రులతో ఊహించని కలహాలు కలుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.

వృషభం: నూతన వాహన యోగం ఉన్నది. సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.

మిధునం:వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడతాయి. కొన్ని పనులు మధ్యలో వాయిదా పడతాయి. నూతన రుణాలు చేస్తారు. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. బంధుమిత్రులతో కొన్ని వ్యవహారాలలో విభేదాలు కలుగుతాయి.

కర్కాటకం: దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు చేపట్టిన పనులలో అనుకూల వాతావరణం ఉంటుంది.

సింహం:విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపార ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.

కన్య: చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. మిత్రులతో కొన్ని వ్యవహారాలలో మాటపట్టింపులు కలుగుతాయి. గృహ విషయమై ఆలోచనలు స్థిరంగా ఉండవు. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి ఆర్థిక ఇబ్బందులు వలన నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు.

తుల: అనారోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగవు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి, ఉద్యోగమున పని ఒత్తిడి అధికామౌతుంది బంధుమిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కుటుంబసమస్యలు చికాకు పరుస్తాయి.

వృశ్చికం: ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆప్తులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.

ధనస్సు: ఉద్యోగమున అధికారులతో చర్చలు సఫలం అవుతాయి. దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.

మకరం: ఆరోగ్యం విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఇంటాబయట బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి కుటుంబ పెద్దల వ్యాపారాలు కొంత మందగిస్తాయి.

కుంభం: వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. కొన్నిపనులు వాయిదా వేస్తారు. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. ముఖ్యమైన వ్యవహారాలు శ్రమతో కానీ పూర్తి కావు. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది.

మీనం: దాయాదులతో భూవివాదాలు పరిష్కారమౌతాయి. సంఘంలో ఆదరణ పెరుగుతుంది. చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

Next Story