శుక్ర‌వారం రాశిఫ‌లాలు.. రుణదాతల నుండి ఒత్తిడి.. ఊహించని సమస్యలు

Daily horoscope for 16-09-2022.ఉద్యోగాలలో సహోద్యోగుల వలన ఊహించని సమస్యలు కలుగుతాయి.

By జ్యోత్స్న  Published on  15 Sep 2022 11:30 PM GMT
శుక్ర‌వారం రాశిఫ‌లాలు.. రుణదాతల నుండి ఒత్తిడి.. ఊహించని సమస్యలు

మేషం: ఉద్యోగాలలో సహోద్యోగుల వలన ఊహించని సమస్యలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక అశాంతి కలుగుతుంది. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్య విషయాలలో కొంత శ్రద్ధ వహించాలి. వ్యాపారాలు కొంత మందకోడిగా సాగుతాయి. ధన పరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి.

వృషభం: సమాజంలో పరిచయాలు విస్తృతమవుతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. స్థిరాస్తి వివాదాలకు సంబంధించి ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం సేకరిస్తారు. వృత్తి వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో ఆశించిన మార్పులుంటాయి ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి.

మిధునం: చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది వృత్తి వ్యాపారాలలో వ్యయప్రయాసలు తప్పవు. ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి. ఒక వ్యవహారంలో సన్నిహితుల నుంచి అందిన సమాచారం నిరాశ కలిగిస్తుంది.

కర్కాటకం: ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు నిజం అవుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. మంచి మాట తీరు తో అందరినీ ఆకట్టుకుంటారు.

సింహం: స్థిరాస్తి క్రయవిక్రయాలలో లాభాలు అందుకుంటారు. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో స్వంత ఆలోచనలు కలసివస్తాయి. దైవదర్శనాలు చేసుకుంటారు.

కన్య: వ్యాపార లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు అధికమవుతాయి ఆప్తులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. దైవదర్శనాలు చేసుకుంటారు ప్రయాణాలలో శ్రమ మరింత అధికమవుతుంది. విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

తుల: కుటుంబసభ్యులు ఒత్తిడులు పెంచుతారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. ధన పరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు వలన విశ్రాంతి ఉండదు.

వృశ్చికం: సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత జ్ఞాపకాలు పంచుకుంటారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగయోగం ఉన్నది. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ధనస్సు: విలువైన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆప్తుల నుంచి అవసరానికి ధనం లభిస్తుంది. కుటుంబ సభ్యుల నుండి కీలక సమాచారం అందుతుంది. వ్యాపార ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.

మకరం: వ్యాపారాలో పెట్టిన పెట్టుబడులకు తగిన లాభాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది ఆర్థిక ఇబ్బందులు మరింత బాధిస్తాయి. దైవదర్శనాలు చేసుకుంటారు ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు.

కుంభం: కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటారు. సోదరులతో స్థిరస్తి వివాదాలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు వలన నూతన ఋణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. వ్యాపార, ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.

మీనం: పుణ్యక్షేత్ర సందర్శనం చేసుకుంటారు. నూతన వాహన యోగం ఉన్నది. నిరుద్యోగ యత్నాలు ఫలిస్తాయి. సంఘంలో సరైన గౌరవ మర్యాదలు పొందుతారు. వ్యాపారులకు నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో సమస్యలను అధిగమిస్తారు చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది.

Next Story