నేటి రాశి ఫ‌లాలు.. వీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం ఉత్త‌మం

Daily horoscope for 16-08-2022.నేటి రాశి ఫ‌లాలు.. వీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం ఉత్త‌మం

By జ్యోత్స్న  Published on  15 Aug 2022 11:26 PM GMT
నేటి రాశి ఫ‌లాలు.. వీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం ఉత్త‌మం

మేషం : మానసిక ఒత్తిడి పెరుగుతుంది. బంధువులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. చేపట్టిన పనులో ప్రతిష్టంభనలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. దైవదర్శనాలు చేసుకుంటారు. వృధా ఖర్చులు చేస్తారు.

వృషభం : సమాజంలో గౌరవ మర్యాదలుకు లోటు ఉండదు. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. దూర ప్రాంత మిత్రుల నుండి విలువైన విషయాలు సేకరిస్తారు. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు.

మిధునం : స్థిరాస్తి కొనుగోలు అవరోధాలు తొలగుతాయి. చేపట్టిన పనులలో అప్రయత్నంగా పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందువినోదాలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు.

కర్కాటకం: సోదరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి ఉద్యోగమున బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించలేక అధికారుల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు లో శ్రమాధిక్యత కలుగుతుంది. ధన పరంగా ఒడిదుడుకులు ఉంటాయి.

సింహం : చేపట్టిన పనులు సకాలంలో పూర్తికావు. దూర ప్రయాణాలలో మార్గావరోధాలు కలుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఊహించని ఇబ్బందులు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

కన్య : పాత మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. నూతన ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి.నూతన విద్య ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు.

తుల : వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమవుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాదిస్తారు. ఉద్యోగమున ఉన్నతి కలుగుతుంది. కుటుంబ సభ్యులు సలహాలు కొన్ని విషయాల్లో కలిసి వస్తాయి. స్ధిరాస్తి సంభందిత క్రయవిక్రయాలలో లాభాలు అందుకుంటారు.

వృశ్చికం : వృత్తి వ్యాపారాలు సమస్యాత్మకంగా సాగుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. కుటుంబ పెద్దల అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగమున సమస్యలు కలుగుతాయి. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. ధన పరంగా తొందరపడి ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు.

ధనస్సు : కొందరి మాటల వలన మానసిక సమస్యలు కలుగుతాయి.నిరుద్యోగులకు అధిక శ్రమతో కాని ఫలితం అందదు. కొన్ని వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలసిరావు. అకారణంగా బంధువులతో వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలలో భాగస్వాములతో మాటపట్టింపులు ఉంటాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి.

మకరం : ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. నూతన వాహన భూ లాభాలు ఉంటాయి. గృహమున వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. వృత్తి, వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు అందుకుంటారు. బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

కుంభం : ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. శ్రమతో కూడిన దూరప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనుల్లో ప్రతిష్టంభన కలుగుతుంది. కుటుంబ సభ్యులతో ఊహించని విభేదాలు కలుగుతాయి.

మీనం : సంఘంలో పెద్దల ఆదరణ పెరుగుతుంది. శుభకార్యాల కొరకు ధనం ఖర్చు చేస్తారు. అనుకున్న పనులలో కార్యసిద్ధి కలుగుతుంది వృత్తి, వ్యాపారాలలో సమస్యలు అధిగమిస్తారు.దాయాదులతో స్ధిరాస్తి వివాదాల పరిష్కారం అవుతాయి. ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలు పొందుతారు.

Next Story