నేటి దిన ఫలాలు
Daily Horoscope for 15-10-2022.వృత్తి వ్యాపారాలలో ఇతరులతో విభేదాలు కలుగుతాయి.
By జ్యోత్స్న Published on 15 Oct 2022 5:00 AM ISTమేషం: వృత్తి వ్యాపారాలలో ఇతరులతో విభేదాలు కలుగుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చెయ్యవలసి వస్తుంది. ఉద్యోగమున పని భారం పెరుగుతుంది ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ధన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు కలిసిరావు.
వృషభం: వ్యాపారాలు విస్తరిస్తారు. దీర్ఘకాలిక రుణభారం కొంత వరకు తీరి ఊరట చెందుతారు. సకాలంలో పనులు పూర్తిచేస్తారు. ఆర్థిక వ్యవహారాలు కలసివస్తాయి. ఉద్యోగమున అధికారుల సహాయం అందుతుంది గృహమున శుభకార్య ప్రస్తావన వస్తుంది. నూతన ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి.
మిధునం: మిత్రులతో మాటపట్టింపులు తప్పవు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. పనులు ముందుకు సాగక చికాకు పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. దూర ప్రయాణాల వలన విశ్రాంతి ఉండదు. ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి.
కర్కాటకం: స్థిరస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులలో కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగమున హోదాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల నుండి ఆసక్తికర విషయాలు తెలుసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరుకు ప్రశంసలు పొందుతారు.
సింహం: చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ముఖ్యమైన పనులలో కుటుంబ సభ్యుల సహాయంతో పూర్తి చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలంగా సాగుతాయి. ఆకస్మిక ధనలబ్ది పొందుతారు. సన్నిహితులతో విందువినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.
కన్య: ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ఉద్యోగమున వివాదాలకు దూరంగా ఉండటం మంచిది బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి.
తుల: ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలలో నిలకడ లోపిస్తుంది. నూతన రుణాలు చెయ్యవలసి వస్తుంది. నిరుద్యోగప్రయత్నాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగస్తులు అధికారులతో అప్రమత్తంగా వ్యవహారించాలి ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి.
వృశ్చికం: నిరుద్యోగ యత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఆర్ధిక పురోగతి సాధిస్తారు. వ్యాపార వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. ఉద్యోగాలలో అధికారులతో చర్చలు లాభసాటిగా సాగుతాయి.
ధనస్సు: వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు అందుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి వృత్తి ఉద్యోగాలలో పలుకుబడి పెరుగుతుంది. సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు.
మకరం: స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆర్థిక వ్యవహారాలలో సన్నిహితుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. నూతన వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు తప్పవు.
కుంభం: వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. కొన్ని వ్యవహారాలలో మానసిక సమస్యలు తప్పవు. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. దాయదులతో స్ధిరాస్తి వివాదాలు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది.
మీనం: ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయిచేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగమున్నది సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.