నేటి దిన ఫ‌లాలు

Daily horoscope for 13-10-2022.వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.

By జ్యోత్స్న  Published on  12 Oct 2022 11:30 PM GMT
నేటి దిన ఫ‌లాలు

మేషం: వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. ఉద్యోగులు ఆశించిన స్థానచలన సూచనలున్నవి ఇంటా బయట బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తారు. విలువైన వస్తు లాభాలు పొందుతారు.

వృషభం: బంధువులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ఇంటాబయట సమస్యలు చికాకు పరుస్తాయి. దూరప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి వ్యాపారాలు సాదాసీదాగా నడుస్తాయి. ఉద్యోగులు అధికారుల ఆగ్రహానికి గురవుతారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

మిధునం: దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. చేపట్టిన పనులలో మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి చిన్ననాటి మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తవుతాయి.

కర్కాటకం: సన్నిహితుల నుంచి ఆర్థిక లాభాలు పొందుతారు. సంఘంలో పరపతి పెరుగుతుంది. నిరుద్యోగ యత్నాలు సానుకూలమవుతాయి. ఉద్యోగమున అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. దైవ చింతన పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

సింహం: ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వ్యాపారాలు సామాన్యంగా లాభిస్తాయి. కీలక వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు అమలు చెయ్యడం మంచిది. ఉద్యోగస్తులు విధుల్లో సమస్యలు తప్పవు. బంధు వర్గం వారితో విభేదాలు కలుగుతాయి ఆర్థిక ఇబ్బందులు వలన నూతన రుణయత్నాలు చేస్తారు.

కన్య: వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. చేపట్టిన పనులు మధ్యలో వాయిదా పడతాయి. వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించవు. ఉద్యోగులకు సహోద్యోగులతో మాటపట్టింపులు కలుగుతాయి స్థిరస్తి ఒప్పందాలలో ఆటంకాలు తప్పవు. నూతన రుణయత్నాలు కలసిరావు.

తుల: భూవివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

వృశ్చికం: ఉద్యోగులకు జీతభత్యాలా విషయంలో సానుకూల ఫలితాలుంటాయి. సంఘంలో పెద్దల నుండి వివాదాలకు సంభందించి ముఖ్య సమాచారం అందుతుంది. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. పనుల్లో మరింత పురోగతి సాధిస్తారు. మిత్రుల నుంచి వివాహ శుభాకార్య ఆహ్వానాలు అందుతాయి.

ధనస్సు: ఆర్థిక ఇబ్బందుల వలన మానసిక సమస్యలు కలుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. నిరుద్యోగులు మరింత కష్టపడాలి. వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడుతాయి కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది.

మకరం: వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఇతరులకు ధనపరంగా మాట ఇవ్వడం మంచిది కాదు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు గృహమున మీ ఆలోచనలు అందరికి నచ్చవు. స్థిరస్తి వ్యవహారాలలో తొందరపాటు మంచిది కాదు.

కుంభం: ఉద్యోగ విషయంలో సమస్యలు అధిగమించి ముందుకు సాగుతారు. సన్నిహితుల నుండి కీలక విషయాలు తెలుసుకుంటారు. ఆర్థిక పరంగా ఇబ్బందులు తొలగుతాయి సంతానానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి. నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు అందుతాయి.

మీనం: కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. వ్యాపారాలలో భాగస్థులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి.

Next Story