ఈ రాశివారికి ఆక‌స్మిక ధ‌న‌లాభం

Daily horoscope for 12-11-2022.ఇంటాబయట మానసిక సమస్యలు పెరుగుతాయి.

By జ్యోత్స్న  Published on  12 Nov 2022 1:55 AM GMT
ఈ రాశివారికి ఆక‌స్మిక ధ‌న‌లాభం

మేషం:ఇంటాబయట మానసిక సమస్యలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఊహించని నష్టాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఆర్ధిక పరిస్థితి మందగిస్తుంది. ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి.

వృషభం: నిరుద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాలలో విస్తరణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఋణ సమస్యలు నుండి బయటపడతారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి.

మిధునం: వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. మిత్రులతో విభేదాలు కలుగుతాయి. ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభించదు. ఇంటాబయట గందరగోళ పరిస్థితులుంటాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తికావు.

కర్కాటకం: స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగాల్లో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. విద్యార్థుల కష్టం ఫలిస్తుంది. సన్నిహితుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

సింహం: ఉద్యోగస్తులకు పనిఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది. మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలలో నూతన ఆలోచనలు అమలు పరుస్తారు.

కన్య: కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. బంధుమిత్రులతో ఊహించని కలహా సూచనలున్నవి. ఉద్యోగమున ఊహించని సమస్యలు కలుగుతాయి. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి.

తుల: వృత్తి వ్యాపారాలలో వివాదాలు చికాకు పరుస్తాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. నిరుద్యోగులకు ప్రయత్నాలు ఫలించవు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు తప్పవు. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు మానుకోవాలి. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు.

వృశ్చికం:కుటుంబ సభ్యులతో దైవ దర్శనం చేసుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలుచేస్తారు. వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి.

ధనస్సు: వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహంతో నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. కొన్ని ముఖ్య వ్యవహారాలలో ఆలోచనలు ఆచరణలో పెడతారు. చేపట్టిన వ్యవహారాలు విజయవంతంగా పూర్తి అవుతాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.

మకరం: వ్యాపార ఉద్యోగాలలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. బంధు వర్గం వారితో అకారణ విభేదాలు కలుగుతాయి. అనుకున్న సమయానికి డబ్బు చేతికి అందక ఇబ్బంది కలుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

కుంభం: వ్యాపారాలలో భాగస్థుల ప్రవర్తన చికాకు పరుస్తుంది. ఋణ ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు. ఖర్చుల విషయంలో ఆలోచించి వ్యవహరించడం మంచిది. వృత్తి ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి.

మీనం: వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. సమాజంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. సోదరులతో సఖ్యతగా వ్యవహారిస్తారు. చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

Next Story