నేటి దిన ఫ‌లాలు.. ఈ రాశివారికి ఉద్యోగాల‌లో ప‌దోన్న‌తులు

Daily Horoscope for 12-10-2022.దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.

By జ్యోత్స్న  Published on  11 Oct 2022 11:30 PM GMT
నేటి దిన ఫ‌లాలు.. ఈ రాశివారికి ఉద్యోగాల‌లో ప‌దోన్న‌తులు

మేషం: దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి వ్యాపారాల విస్తరణకు నూతన ప్రణాళికలు అమలుచేస్తారు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి.

వృషభం: వృధా ఖర్చులు పెరుగుతాయి.దైవ చింతన కలుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఇంటా బయట నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి.

మిధునం: ఉద్యోగమున ఉన్నతి కలుగుతుంది. విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. వ్యాపారమున లాభాలు పెరుగుతాయి.సమాజంలో ప్రముఖుల సహాయ సహకారాలు అందుతాయి. నిరుద్యోగ సమస్యలు తొలగుతాయి. గృహమున కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి.

కర్కాటకం: వ్యాపార, ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా రాణిస్తారు. సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుతుంది. కీలక సమయంలో కుటుంబ సభ్యుల సహాయం అందుతుంది. బంధువులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక పరిస్థితి ఆశజనకంగా ఉంటుంది.

సింహం: సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. కొన్ని కార్యక్రమాలు వాయిదా పడుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఉద్యోగమున చికాకులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించనప్పటికి అవసరానికి ధనం అందుతుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.

కన్య: ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. విద్యార్థుల పరీక్ష ఫలితాలు నిరాశ కలిగిస్తాయి. భూ సంభంధిత వివాదాలు కలుగుతాయి. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వ్యాపారమున పెట్టుబడుల విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది.

తుల: ఉద్యోగాలలో అనుకున్నది సాధిస్తారు. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. ఊహించని రీతిలో నిరుద్యోగులకు అవకాశములు అందుతాయి.

వృశ్చికం: ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. మొండిబాకీలు వసూలవుతాయి. ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. చాలకాలంగా వేదిస్తున్న సమస్యలు పరిష్కారమౌతాయి నూతన భూ గృహ యోగమున్నది.

ధనస్సు: ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తారు.చేపట్టిన పనులలో శ్రమ మరింత పెరుగుతుంది. రుణదాతల ఒత్తిడితో నూతన రుణాలు చెయ్యవలసి వస్తుంది. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన శిరోబాధను కలిగిస్తుంది. ప్రయాణాలు వాయిదా పడుతాయి.

మకరం: ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. అనుకున్న వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. వ్యాపారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది ఉద్యోగాలలో రావలసి అవకాశాలు చేజారుతాయి కుటుంబసభ్యులతో అకారణంగా తగాదాలు కలుగుతాయి.

కుంభం: సన్నిహితులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో మీ సేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది. గృహమున మిత్రులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు విలువైన వస్తు లాభలు పొందుతారు.

మీనం: కుటుంబ సభ్యుల నుంచి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. వ్యాపారాలు మందగిస్తాయి. బంధువులతో మాటపట్టింపులుంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగమున కొన్ని వ్యవవహారాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు తప్పవు.

Next Story