నేటి రాశి ఫ‌లాలు

Daily horoscope for 12-08-2022.నేటి రాశి ఫ‌లాలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Aug 2022 11:30 PM GMT
నేటి రాశి ఫ‌లాలు

మేషం: ఆర్థికంగా పురోగతి కలుగుతుంది. దైవ చింతన పెరుగుతుంది. వ్యాపారాలలో అంచనాలు అందుకోవడానికి చేసే ప్రయత్నాలు సఫలమౌతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన విషయాలు తెలుసుకుంటారు. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

వృషభం: విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు వేగంగా పూర్తిచేస్తారు. దూరప్రాంత బంధు మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన మార్పులు చోటుచేసుకుంటాయి. ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. సన్నిహితులతో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

మిధునం: ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. చేపట్టిన పనులు నిదానంగా పూర్తిచేస్తారు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారమున గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

కర్కాటకం: జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన నిరాశ కలిగిస్తుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. నిరుద్యోగులకు ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. బంధు మిత్రులతో కలహా సూచనలున్నవి. కుటుంబ విషయంలో ఆలోచనలలో స్థిరత్వం లోపిస్తుంది.

సింహం: నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్ధిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. దూరపు బంధుమిత్రుల రాకతో గృహమున సందడి వాతావరణం ఉంటుంది. సంతాన విద్యా విషయాల్లో శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి.

కన్య: వ్యాపార వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. ఉద్యోగమున అదనపు బాధ్యతల నుండి ఉపశమనం లభిస్తుంది.

తుల: కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత మానసిక చికాకు కలిగిస్తుంది. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చెయ్యాలి. ప్రారంభించి పనులు మధ్యలో నిలిచిపోతాయి. దైవ చింతన కలుగుతుంది. ఉద్యోగాలలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

వృశ్చికం: అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో విభేదాలు కలుగుతాయి.

ధనస్సు: బంధు మిత్రులతో గృహమున విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు కార్యసిద్ధి కలుగుతుంది. ఆర్థిక లావాదేవీలు ఆశించిన విధంగా సాగుతాయి. స్థిరాస్తి క్రయవిక్రయాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి,ఉద్యోగాలలో నూతన అవకాశాలు అందుకుంటారు.

మకరం: వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ప్రయాణాలలో తొందరపాటు మంచిది కాదు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. అవసరానికి చేతిలో డబ్బు అందక ఇబ్బంది కలుగుతుంది. ఉద్యోగమున అదనపు బాధ్యతలు వలన విశ్రాంతి ఉండదు. బంధువుల ప్రవర్తన కొంతచికాకు కలిగిస్తుంది.

కుంభం: ఆర్థిక పురోగతి సాధిస్తారు. వ్యాపారములలో స్వంత నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగ యత్నాలు సానుకూల ఫలితాన్నిస్తాయి. సంఘంలో విశేషమైన ఆదరణ లభిస్తుంది.

మీనం: దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఉద్యోగమున అధికారులతో ఆలోచించి మాట్లాడటం మంచిది. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు రాణించక ఇబ్బంది పడతారు. సన్నిహితులతో మాటపట్టింపులుంటాయి.

Next Story