నేటి రాశి ఫ‌లాలు.. వీరికి అదృష్టం వెన్నంటే

Daily horoscope for 11-11-2022.కొన్ని పనులలో శిరోబాధలు తప్పవు. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి.

By జ్యోత్స్న  Published on  11 Nov 2022 1:52 AM GMT
నేటి రాశి ఫ‌లాలు.. వీరికి అదృష్టం వెన్నంటే

మేషం: కొన్ని పనులలో శిరోబాధలు తప్పవు. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి వ్యాపారాలు మరింత నిరుత్సాహ పరుస్తాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి.

వృషభం: వ్యాపారాలలో కష్టానికి తగిన లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. దూర ప్రాంత బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు.

మిధునం: ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో పనిభారం పెరుగుతుంది. ఆకస్మికంగా నిర్ణయాలలో మార్పులు చేసుకుని ఇబ్బంది పడతారు. ప్రయాణాలు వాయిదా పడుతాయి. చేపట్టిన వ్యవహారాలు కొంత నిదానంగా సాగుతాయి. బంధువర్గంతో స్వల్ప వివాదాలు కలుగుతాయి.

కర్కాటకం: విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. దూరపు ప్రాంత బంధువుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుకుంటారు.

సింహం: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నిరుద్యోగులకు అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగ విషయమై శుభవార్త అందుతాయి. విందు వినోదాది కార్యక్రమాలలో విరివిగా పాల్గొంటారు. వ్యాపారాలకు సకాలంలో పెట్టుబడులు అందుతాయి.

కన్య: వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. చేపట్టిన పనులు అవాంతరాలు కలిగిన మధ్యలో నిలిచిపోతాయి. వ్యాపారాలలో ఇతరుల సలహాలు తీసుకోవడం మంచిది. నిరుద్యోగులకు కొంత నిరాశ తప్పదు ముఖ్యమైన పనులలో తొందరపాటు నిర్ణయాలు వలన ఆర్ధిక నష్టాలు కలుగుతాయి.

తుల: ముఖ్యమైన పనులలొ ఆటంకాలుంటాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరం అవుతాయి. దీర్ఘకాలిక ఋణాలు తీర్చడానికి నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. దైవ సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. దూర ప్రయాణాలు చికాకు కలిగిస్తాయి.

వృశ్చికం: శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. ఉద్యోగమున అనుకూల వాతావరణం ఉంటుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి.

ధనస్సు: వాహన కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి.నిరుద్యోగులకు చాలా కాలంగా వేచి చూస్తున్న అవకాశములు లభిస్తాయి. ఉద్యోగమున సమస్యల నుండి చాకచక్యంగా బయట పడతారు. గృహమున సన్నిహితుల కలయిక సంతోషం కలిగిస్తుంది. కొన్ని పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి.

మకరం: ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించడం మంచిది. దైవ చింతన కలుగుతుంది .వృత్తి ఉద్యోగములలో పని ఒత్తిడి పెరుగుతుంది. కొన్ని వ్యవహారాలలో కీలక మార్పులు చేస్తారు. మిత్రుల నుండి ధన పరమైన సమస్యలు కలుగుతాయి దూర ప్రయాణాల వలన శ్రమాధిక్యత పెరుగుతుంది.

కుంభం: వృత్తి, వ్యాపారాలు ఆశించిన రీతిలో సాగవు. సన్నిహితులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. చేసినపని మళ్ళీ మళ్ళీ చెయ్యవలసిన వస్తుంది. ఆరోగ్యం అంతగా అనుకూలించదు. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. ఇంటా బయట సమస్యాత్మక వాతావరణం ఉంటుంది.

మీనం: చేపట్టిన వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి. చాలాకాలంగా తీరని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. బంధుమిత్రులతో గృహమున సందడిగా గడుపుతారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు.

Next Story