ఈ రాశివారికి ధ‌న లాభం

Daily horoscope for 10-12-2022.బంధు వర్గం నుండి ఋణ ఒత్తిడి పెరుగుతుంది

By జ్యోత్స్న  Published on  10 Dec 2022 1:53 AM GMT
ఈ రాశివారికి ధ‌న లాభం

మేషం: బంధు వర్గం నుండి ఋణ ఒత్తిడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. వ్యాపారాలలో చిన్నపాటి సమస్యలు తప్పవు. ఉద్యోగాలలో ఆకస్మిక స్థానచలన సూచనలున్నవి. స్తిరస్థుల క్రయవిక్రయాలలో ఆటంకాలు కలుగుతాయి.

వృషభం: వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది. నూతన ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. ఉద్యోగాలలో అవాంతరాలు తొలగుతాయి. చేపట్టిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఇంటాబయ అనుకూల వాతావరణం ఉంటుంది.

మిధునం: కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. సోదరులతో ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. చేపట్టిన పనులు నిదానిస్తాయి.

కర్కాటకం: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మీ ఆలోచనలు అందరికి నచ్చుతాయి. భూ క్రయ విక్రయాలు లాభిస్తాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా ఉంటాయి. పాత సంఘటనలు జ్ఞప్తికి వస్తాయి.

సింహం: నూతనోత్సాహంతో కొన్ని వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కీలక సమయంలో ఆప్తుల సలహాలు కలసి వస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి, ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగులు నిరీక్షణ ఫలిస్తుంది.

కన్య: ఆర్థిక ఇబ్బందులు వలన నూతన రుణాలు చేసుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. ప్రయాణాలు వాయిదా పడుతాయి. చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమౌతాయి. బంధువులతో అకారణ విభేదాలు తప్పవు.

తుల: ఆర్థిక లావాదేవీలు కొంత నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. దూరప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు.

వృశ్చికం: వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. బంధు మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. పనులలో చికాకులు పెరుగుతాయి. ఉద్యోగాలలో మీ హోదా పెరుగుతుంది. దీర్ఘ కాలిక రుణబాధలు తొలగుతాయి. దూరప్రయాణాలు వాయిదా పడుతాయి.

ధనస్సు: ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. వ్యాపార విస్తరణకు అవరోదాలు తొలగుతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతాయి.

మకరం: దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. నూతన రుణాలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో కొత్త సమస్యలు తప్పవు. ఆత్మీయులతో కొన్ని విషయాలలో విభేదాలు కలుగుతాయి. ప్రయాణాలలో ఊహించని మార్పులు ఉంటాయి.

కుంభం: ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలలో నూతన సమస్యలు కలుగుతాయి. నూతన రుణాలు చేస్తారు. దూరపు బంధువుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది.

మీనం: ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా సాగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కలుగుతుంది. వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల నుండి ఊహించని ఆహ్వానాలు అందింతాయి.

Next Story