కుటుంబ స‌భ్యులతో వివాదాలు.. ఆదాయానికి మించిన ఖ‌ర్చులు

Daily horoscope for 10-09-2022. వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు

By జ్యోత్స్న  Published on  9 Sep 2022 11:30 PM GMT
కుటుంబ స‌భ్యులతో వివాదాలు.. ఆదాయానికి మించిన ఖ‌ర్చులు

మేషం: వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి బంధువుల ద్వారా ముఖ్య సమాచారం అందుతుంది. ఉద్యోగాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.

వృషభం: చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.ఇంటాబయట చిత్రవిచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. ఉద్యోగాలలో సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. ఆర్థిక పరిస్థితి మరింత పుంజుకుంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

మిధునం: ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి ప్రయాణాలు అప్రమత్తంగా వ్యవహరించాలి. నూతన ఋణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగాలలో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. వ్యాపారాల విస్తరణలో అవరోధాలు కలుగుతాయి.

కర్కాటకం: ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. గృహమున కుటుంబసభ్యులతో వివాదాలు కలుగుతాయి ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తప్పవు. ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి.

సింహం: వ్యాపారాలు లాభాల బాట పడతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుకుంటారు. ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి.

కన్య: చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు పాత రుణాలు తీర్చగలుగుతారు. మిత్రులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపార , ఉద్యోగాలలో మీ అంచనాలు నిజమవుతాయి. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.సంతాన వివాహ విషయం పై గృహమున చర్చలు జరుగుతాయి.

తుల: గృహ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. చేపట్టిన పనులలో ఆటంకాలు కలుగుతాయి. ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. దైవదర్శనాలు చేసుకుంటారు. ఆర్థిక ఇబ్బందుల వలన నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు.

వృశ్చికం: అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.ప్రయాణాలు వాయిదా పడతాయి. కొన్ని వ్యవహారాలలో బంధుమిత్రులు మీ మాటతో విభేదిస్తారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు. ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు రద్దు చేసుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.

ధనస్సు: వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సభ్యుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు.గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

మకరం: చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలించవు. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. ఆరోగ్యం మందగిస్తుంది. ఉద్యోగాలలో ఆశించిన మార్పులు ఉండవు మిత్రుల నుంచి ఊహించని సమస్యలు కలుగుతాయి.వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి.

కుంభం: గృహమున మీ ఆలోచన అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటాయి. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి.

మీనం: సోదరులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. స్థిరస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. ఇంటాబయట ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి.

Next Story