ఈ రాశివారు ప్ర‌యాణాలు వాయిదా వేసుకోవ‌డం మంచిది

Daily horoscope for 10-08-2022.ఈ రాశివారు ప్ర‌యాణాలు వాయిదా వేసుకోవ‌డం మంచిది

By జ్యోత్స్న  Published on  9 Aug 2022 11:30 PM GMT
ఈ రాశివారు ప్ర‌యాణాలు వాయిదా వేసుకోవ‌డం మంచిది

మేషం : వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. సంతానం నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

వృషభం: బంధుమిత్రులతో వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చేసి మీ విలువ పెంచుకుంటారు. ఉద్యోగాలలో ఆశించిన అభివృద్ధి కలుగుతుంది. దూర ప్రయాణాలు లాభిస్తాయి. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు.

మిధునం: చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. బంధు మిత్రులతో ధన వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండడం మంచిది. నిరుద్యోగ యత్నాలు కలిసిరావు. గృహనిర్మాణ ప్రయత్నాలు త్వరితగతిన పూర్తి కావు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.

కర్కాటకం: గృహమున కొందరి ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో నూతన ప్రోత్సహకాలు అందుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. స్ధిరాస్తి క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇతరుల నుండి అవసరానికి సహాయం అందుతుంది.

సింహం: సోదరులతో స్థిరాస్తి వివాదాలు తొలగుతాయి. గృహమున బంధు మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతాన విద్యా విషయంలో శుభ వార్తలు అందుతాయి. వృత్తి ఉద్యోగమున అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది.

కన్య: వృత్తి ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. గృహంలో చికాకులు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు పెరుగుతాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి ఆర్ధిక వ్యవహారాలు మరింత ఇబ్బంది కలిగిస్తాయి.

తుల: స్థిరమైన నిర్ణయాలు తీసుకోకపోవడం వలన నష్టపడతారు. నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రయాణాలు చేస్తారు. వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

వృశ్చికం: వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సజావుగా సాగుతాయి. ఆర్ధిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. సోదరుల సహాయంతో వివాదాల నుండి బయట పడతారు. ఉద్యోగస్థులకు పదోన్నతులు పెరుగుతాయి. బంధుమిత్రుల ఆగమనం సంతోషం కలిగిస్తుంది.

ధనస్సు: ఆలయ సందర్శన చేసుకుంటారు. కుటుంబ వ్యవహారాలలో సొంత నిర్ణయాలు తీసుకోరాదు. ఇంటా బయట కొందరి ప్రవర్తన ఆందోళన కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగమున అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.

మకరం: స్థిరమైన ఆలోచనలు చేసి లాభపడతారు గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. వృత్తి ఉద్యోగాలలో చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఉద్యోగాలలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు.

కుంభం: వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు రావు. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఉద్యోగమున మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించదు. ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్త వహించాలి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఋణ ప్రయత్నాలు కలిసిరావు.

మీనం: ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. గృహమున బంధు మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగమున అనుకూలత పెరుగుతుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

Next Story