ఈ రాశి వారికి ఉద్యోగంలో స‌మ‌స్య‌లు

Daily horoscope for 1-10-2022.స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలలో పురోగతి

By జ్యోత్స్న  Published on  1 Oct 2022 7:20 AM IST
ఈ రాశి వారికి ఉద్యోగంలో స‌మ‌స్య‌లు

మేషం:స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. చేపట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది.

వృషభం: కుటుంబసభ్యులతో మాటపట్టింపులు కలుగుతాయి. ముఖ్యమైన పనులలో అవాంతరాలు తప్పవు. వ్యాపారమున ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగమున సమస్యలు ఉంటాయి. దీర్ఘకాలిక రుణాల ఒత్తిడి నుండి బయటపడటానికి నూతన రుణాలు చేస్తారు.

మిధునం:దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. చేపట్టిన పనులు మధ్యలో విరమిస్తారు. చిన్ననాటి మిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. స్థిరాస్తి క్రయ విక్రయాలు కలసిరావు.

కర్కాటకం: చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాగలవు. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. బందు వర్గం వారి నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన మిత్రుల పరిచయాలు పెరుగుతాయి.

సింహం:సంతానానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. సమాజంలో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలకు కొదవ ఉండదు. స్థిరాస్తి కొనుగోలు యత్నాలు సఫలమవుతాయి.

కన్య:వృధా ఖర్చులు చేస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. బంధువులతో మాటపట్టింపులుంటాయి. ముఖ్యమైన పనులలో కష్టపడ్డా ఫలితం కనిపించదు. అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. ఉద్యోగాలలో పురోభివృద్ధి కలుగుతుంది. సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి.

తుల: వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. పనుల్లో ప్రతిష్ఠంభనలు కలుగుతాయి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది సోదరులతో స్వల్ప విభేదాలు తప్పవు. ఉద్యోగాలలో ఆశించినస్థానచలనాలు ఉండవు. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి.

వృశ్చికం: వాహన అనుకూలత కలుగుతుంది. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. సోదరుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో నూతనోత్సాహంతో పనిచేస్తారు. కొన్ని వివాదాలు పరిష్కరమవుతాయి.

ధనస్సు: దైవ కార్యక్రమాలపై దృష్టి సారించడం మంచిది. బంధువులతో వివాదాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో కష్టానికి తగిన ఫలితం ఉండదు. కుటుంబ సభ్యులకు మీ ఆలోచనలు నచ్చవు. గృహమున పరిస్థితులు మానసికంగా చికాకు పరుస్తాయి.

మకరం: వ్యాపారాలు విస్తరిస్తారు చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. ఆప్తుల సలహాలు కలిసివస్తాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు అవకాశములు దక్కుతాయి. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.

కుంభం:దీర్ఘకాలిక రుణ వత్తిడి పెరుగుతుంది ఆలోచనలు నిలకడగా ఉండవు. ఇంటాబయటా పరిస్థితులు అనుకూలించవు. ఆర్థికంగా ప్రతికూల వాతావరణం ఉంటుంది. మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు గందరగోళంగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు.

మీనం: సన్నిహితుల నుండి ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి, ఉద్యోగాలు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు.

Next Story