నేడు చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఈ రోజు రాశిఫ‌లం ఎలా ఉందంటే..?

Daily horoscope for 08-11-2022. కీలక వ్యవహారాలలో ముఖ్య నిర్ణయాలు చేసి మంచి ఫలితాలు సాధిస్తారు.

By జ్యోత్స్న  Published on  8 Nov 2022 1:38 AM GMT
నేడు చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఈ రోజు రాశిఫ‌లం ఎలా ఉందంటే..?

మేషం: కీలక వ్యవహారాలలో ముఖ్య నిర్ణయాలు చేసి మంచి ఫలితాలు సాధిస్తారు. ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. నూతన ఉద్యోగ యోగం ఉన్నది వృత్తి వ్యాపారాల ప్రారంభానికి అవరోధాలు అధిగమిస్తారు. దీర్ఘకాలిక ఋణసమస్యల నుంచి బయటపడతారు.

వృషభం: వృత్తి ఉద్యోగమున సమస్యలను మనోధైర్యంతో అధిగమిస్తారు దూరప్రాంత బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. సంతానానికి ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి.

మిధునం: గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి. కొన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. గృహమున కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తాయి. స్థిరాస్తి వివాదాలకుపరిష్కార మార్గాలు చూస్తారు. బంధుమిత్రుల నుంచి కీలక సమాచారం సేకరిస్తారు.

కర్కాటకం: ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. మిత్రులతో వివాదాలను పరిష్కారమౌతాయి స్థిరాస్తి కొనుగోలు యత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి.

సింహం: కొన్ని వ్యవహారాలలో సోదరుల నుండి ఆశించిన సహాయం లభిస్తుంది. బంధు మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగాలలో కీలక సమాచారం లభిస్తుంది. నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు లభిస్తాయి. భూ సంబంధిత వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు.

కన్య: ఉద్యోగ విషయంలో సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుని లాభాలు పొందుతారు. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. బంధు మిత్రుల ఆదరణ పెరుగుతుంది. వ్యాపారాలలో స్వల్ప ధనలాభ సూచనలు ఉన్నవి. చేపట్టిన పనులలో జాప్యం కలిగినప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు.

తుల: దూర ప్రాంత బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి.కుటుంబ సభ్యుల నుంచి ధన సహాయం లభిస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో మీ పనితీరుకు అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.

వృశ్చికం: సోదరులతో పాత విషయాల గురించి చర్చిస్తారు.నిరుద్యోగులకు నూతన అవకాశములు పొందుతారు. వృత్తి వ్యాపారాలలొ ఆశించిన లాభాలు పొందుతారు.ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి మరింత ఉత్సాహంగా సాగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి.

ధనస్సు: అధికారుల అనుగ్రహంతో కొన్ని పనులలో విజయం సాదిస్తారు.మిత్రులతో వ్యాపార విషయమై చర్చలు చేస్తారు దూరప్రాంతాల బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ లబ్ధి పొందుతారు కుటుంబ సభ్యులు నుండి అవసరానికి ధన సహాయం లభిస్తుంది.కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

మకరం: నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు. ఇతరులతో ఏర్పడిన వివాదాలు మిత్రుల సహాయంతో రాజీచేసుకుంటారు. ఉద్యోగమున స్వంత ఆలోచనలతో ముందుకు సాగడం మంచిది. దైవ సేవా కార్యక్రమాలకు హాజరు అవుతారు. వ్యాపార పరంగా నూతన అవకాశాలు జార విడవకుండా చూసుకోవాలి.

కుంభం: నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. శుభకార్యాలకు కుటుంబ సభ్యులతో హాజరావుతారు. పనుల్లో శారీరక శ్రమ తప్పదు ముఖ్యమైన వ్యవహారాలలో ఆకస్మిక విజయం పొందుతారు. వృధా ప్రయాణాలు చేయవలసి రావచ్చు.

మీనం: క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. సన్నిహితుల నుండి వివాదాలకు సంభందించి కీలక సమాచారాన్ని సేకరిస్తారు. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆత్మీయుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది.

Next Story