ఈ రాశి వారికి అనారోగ్య సూచ‌నలు ఉన్నాయి

Daily Horoscope for 08-09-2022.ఇంటాబయటా పరిస్థితులు అనుకూలిస్తాయి. సన్నిహితుల సహాయంతో నూతన కార్యక్రమాలు

By జ్యోత్స్న  Published on  7 Sep 2022 11:30 PM GMT
ఈ రాశి వారికి అనారోగ్య సూచ‌నలు ఉన్నాయి

మేషం: ఇంటాబయటా పరిస్థితులు అనుకూలిస్తాయి. సన్నిహితుల సహాయంతో నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆత్మీయుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. స్థిరస్తి వివాదాలకు సంబంధించి వృత్తి వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు.

వృషభం: వ్యాపారాలలో సొంత నిర్ణయాలు అంతగా కలిసి రావు. ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు శ్రమ అనంతరం పూర్తవుతాయి. నిరుద్యోగయత్నాలు మందగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమ అధికమవుతుంది వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

మిధునం: మిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. ఉద్యోగమున పని ఒత్తిడి అధికమవుతుంది దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. వ్యాపార వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి.

కర్కాటకం: ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాలలో తగినంత లాభాలు అందుకుంటారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగుల కలలు సహకారం అవుతాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది.

సింహం: గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన కార్యక్రమాలు ప్రారంభించిన అప్రయత్నంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి, ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి.

కన్య: వ్యాపారపరంగా తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. చేపట్టిన పనులు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. ఆర్థికంగా స్వల్ప ఇబ్బందులు ఉంటాయి మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. దూరప్రయాణ సూచనలున్నవి.

తుల: పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. బంధుమిత్రుల వలన ఊహించని సమస్యలు కలుగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

వృశ్చికం: కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఉద్యోగమున బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.

ధనస్సు: నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది కుటుంబసభ్యులతో మాట పట్టింపులు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఉద్యోగమున అధికారులతో ఓర్పుగా వ్యవహరించడం మంచిది. ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యటం మంచిది.

మకరం: ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మొండి బకాయిలు వసూలవుతాయి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఆర్థిక అనుకూలత కలుగుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటాబయట బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

కుంభం: ఇతరులతో మాట పట్టింపులు తప్పవు. కొన్ని పనులు శ్రమతో కానీ పూర్తి కావు. చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు కొంత సామాన్యంగా సాగుతాయి. ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.

మీనం: బంధుమిత్రులతో విందువినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. దైవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారాలలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

Next Story