నేడు ఈ రాశివారికి ఆర్థికంగా శుభ ఫ‌లితాలు

Daily Horoscope for 04-11-2022. భూ సంభందిత క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు.

By జ్యోత్స్న  Published on  4 Nov 2022 7:16 AM IST
నేడు ఈ రాశివారికి ఆర్థికంగా శుభ ఫ‌లితాలు

మేషం: భూ సంభందిత క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు. నిరుద్యోగయత్నాలు వేగవంతం చేస్తారు. సోదరులు స్థిరస్తి వివాదాలు రాజీ చేసుకుంటారు. బంధు మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ఉద్యోగ విషయంలో అధికారుల ఆదరణ పెరుగుతుంది.

వృషభం: సమాజంలో విశేషమైన గౌరవమర్యాదలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో భాగస్థులతో సఖ్యత కలుగుతుంది. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులలో ఇతరుల సహాయ సహకారాలతో ముందుకు సాగుతారు. ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

మిధునం: చేపట్టిన పనులు శ్రమాధిక్యతతో గాని పూర్తికావు. వృత్తి వ్యాపారాలలో కష్టానికి తగిన ఫలితం లభించదు. కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగతాయి. ఇంటాబయటా ఊహించిన కొన్ని సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఉద్యోగమున అధికారులతో సమస్యలు తప్పవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

కర్కాటకం: వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు స్థిరత్వం ఉండదు. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. సన్నిహితులతో మాటపట్టింపులు కలుగుతాయి. ధన పరమైన విషయాలలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది.

సింహం: పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారపరంగా అవరోధాలను అధిగమించి లాభాల అందుకుంటారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలను దక్కించుకుంటారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.

కన్య: సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో శుభాకార్యాలలో పాల్గొంటారు. గృహ నిర్మాణం ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు కొంత సానుకూల ఫలితాలు ఇస్తాయి. ఉద్యోగస్తులు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు.

తుల: జీవిత భాగస్వామితో ఆలయాలు సందర్శిస్తారు. వృధా ఖర్చులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారములు నిదానంగా సాగుతాయి. ఉద్యోగమున నూతన సమస్యలు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. దూరప్రయాణాల వలన శారీరక శ్రమ పెరుగుతుంది. బంధువర్గం నుండి ఋణ ఒత్తిడులు తప్పవు.

వృశ్చికం: ఇంటాబయటా బాధ్యతలు అధికమవుతాయి. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి వ్యవహారాలలో చికాకులు తప్పవు.అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారమునకు పెట్టుబడులు సకాలంలో అందక ఇబ్బంది పడతారు. ఉద్యోగస్తులకు అధికారుల నుండి కొంత ఒత్తిడి పెరుగుతుంది.

ధనస్సు: దూరపు బంధువుల నుండి విలువైన సమాచారం అందుతుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

మకరం: వృత్తి వ్యాపారాలు మరింత మందకొడిగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతాన విద్యా ఉద్యోగ విషయంలో ఫలితాలు కొంత నిరాశ కలిగిస్తాయి. కుటుంబంలో ఊహించని వివాదాలు కలుగుతాయి. వృధా ఖర్చులు విషయంలో అప్రమత్తంగా వ్యవహారించాలి. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

కుంభం: చేపట్టిన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. గృహమున కొన్ని సంఘటనలు మానసికంగా కలచి వేస్తాయి. వ్యాపార లావాదేవీలు మరింత ఆశాజనకంగా సాగుతాయి. ఉద్యోగస్థులు పదోన్నతులు పొందుతారు. కుటుంబ విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

మీనం: అదనపు బాధ్యతలున్నప్పటికి నిదానంగా పూర్తి చేస్తారు. మిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు. స్థిరాస్తికి సంభందించిన వ్యవహారాలలో ముఖ్య సమాచారం అందుతుంది. చేపట్టిన పనులు వ్యయప్రయాసలతో కానీ పూర్తి కావు. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు నిరుద్యోగ ప్రయత్నాలు కొంత నిరాశ పరుస్తాయి.

Next Story