ఈ రోజు రాశి ఫ‌లం ఎలా ఉందంటే

Daily Horoscope for 04-08-2022.ఈ రోజు రాశి ఫ‌లం ఎలా ఉందంటే

By జ్యోత్స్న  Published on  3 Aug 2022 11:28 PM GMT
ఈ రోజు రాశి ఫ‌లం ఎలా ఉందంటే

మేషం : ప్రముఖ వ్యక్తులతో విలువైన విషయాలు గూర్చి చర్చిస్తారు. జీవిత భాగస్వామితో శుభకార్యాలలో పాల్గొంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణ సూచనలున్నవి. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు లాభాలబాటలో సాగుతాయి.

వృషభం : ఆర్థిక పరంగా అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఉద్యోగాలలో నూతన అవకాశాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. బంధు, మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. శత్రు సంభందమైన సమస్యలు నుండి ఉపశమనం కలుగుతుంది.

మిధునం : ఉద్యోగ వాతావరణం కొంత చికాకు కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఇతరులతో మాటపట్టింపులు ఉంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. దూరప్రయాణాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.

కర్కాటకం : నూతన ఋణాలు చెయ్యవలసి వస్తుంది. బంధు, మిత్రులతో స్పల్ప మాట పట్టింపులుంటాయి. ఇంటా బయటా అదనపు బాధ్యతల వలన చికాకు పెరుగుతుంది. మానసిక అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగస్తులకు ఆకస్మిక స్థానచలన సూచనలున్నవి.

సింహం :వ్యాపార విస్తరణకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు లాభిస్తాయి. వృత్తి, ఉద్యోగాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. ఆర్ధిక అనుకూలత కలుగుతుంది. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అన్నివైపుల నుండి ఆదాయం అందుతుంది.

కన్య : నిరుద్యోగులకు కొన్ని విషయాలలో నిరాశ పెరుగుతుంది. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తప్పవు. వృత్తి వ్యాపారాలలో మందకొడిగా సాగుతాయి. కీలక విషయాలలో ద్విస్వభావ ఆలోచనలు చెయ్యడం మంచిది కాదు. అవసరానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు కొంత నిదానంగా పూర్తవుతాయి.

తుల : ఆర్థికవ్యవహారాలు సంతృప్తి కలిగిస్తాయి. ఇంటా బయట మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతారు. నూతన వ్యాపారాల్లో మరింత పురోగతి సాధిస్తారు. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. స్నేహితుల నుండి ఊహించని సహాయం అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది.

వృశ్చికం: కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆర్ధిక విషయంలో లోటుపాట్లు ఉంటాయి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. నిరుద్యోగులు కొంత ఓర్పుతో ప్రయత్నాలు చేయాలి.

ధనస్సు :సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వ్యాపారాలకు నూతన పెట్టుబడులు అందుతాయి. నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. భూ సంబంధిత వివాదాలు పరిష్కారమై ఊరట చెందుతారు.

మకరం : సమాజంలో ప్రముఖుల నుండి ఆహ్వానాలు అందుతాయి. దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాలలో సమస్యలు అధిగమించి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. ధనపరంగా అనుకూల వాతావరణం ఉంటుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

కుంభం: జీవితభాగస్వామితో పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. చేపట్టిన వ్యవహారాలలో ప్రతికూల వాతావరణం ఉంటుంది. గృహమున కొందరి ప్రవర్తన మానసికంగా చికాకు కలిగిస్తుంది. వ్యాపారమున ఆర్ధిక ఇబ్బందులు కలుగుతాయి. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి ఇబ్బందిపడతారు.

మీనం : దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు పెరుగుతాయి. ఆర్ధిక ఇబ్బందులు బాధిస్తాయి. వాహనప్రయాణలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది. కుటుంబ వ్యవహారాలలో అధిక కష్టంతో అల్ప ఫలితం పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశపరుస్తాయి.

Next Story