నేటి రాశిఫలాలు
Daily Horoscope for 03-11-2022.కుటుంబ విషయాలపై దృష్టి సారిస్తారు. దూరపు బంధువుల నుండి విలువైన సమాచారం అందుతుంది.
By జ్యోత్స్న Published on 3 Nov 2022 7:00 AM ISTమేషం: కుటుంబ విషయాలపై దృష్టి సారిస్తారు. దూరపు బంధువుల నుండి విలువైన సమాచారం అందుతుంది. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో విధులను సమర్ధవంతంగా నిర్వర్తిస్తారు. ఆర్థికంగా ఆశించిన పురోగతి సాధిస్తారు.
వృషభం: స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్ని రంగాల వారికి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటా బయట మంచి మాట తీరుతో అందరిని ఆకట్టుకుంటారు.
మిధునం: వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించవు చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు.
కర్కాటకం: కుటుంబ సభ్యులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల విషయంలో అప్రమత్తంగా వ్యవహారించాలి. సంతాన విద్య విషయాలపై దృష్టి సారించాలి. వృత్తి వ్యాపారాలలో సొంత ఆలోచనలు కలిసిరావు.
సింహం: విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్ధికంగా మెరుగైన వాతావరణం ఉంటుంది. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
కన్య: అవసరానికి ధన సహాయం అంది పాత రుణాలు తీర్చగలుగుతారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో సమస్యలను అదిగమిస్తారు. రాజకీయ ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో స్వంత నిర్ణయాలు కలసివస్తాయి.
తుల: వృధా ఖర్చులు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపార పరంగా ఊహించని సమస్యలు కలుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. చేపట్టిన పనులలో చిన్నపాటి అవరోధాలు తప్పవు.
వృశ్చికం: వృత్తి ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధు వర్గం నుండి వ్యతిరేకత పెరుగుతుంది.
ధనస్సు: స్థిరాస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. సంతాన విద్యా ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధుమిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు.
మకరం: సోదరులతో స్థిరస్తి వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు విశ్రాంతి లేకుండా చేస్తాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. బంధువర్గంతో మాట పట్టింపులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది.
కుంభం: వ్యాపార పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. సంఘంలో విశేషమైన ఆదరణ పెరుగుతుంది. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది. అవసరానికి చేతికి డబ్బు అందుతుంది.
మీనం: వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో వైద్యుల సంప్రదింపులు అవసరమవుతాయి.