నిరుద్యోగుల ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయి

నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. వ్యాపార వ్యవహారాలలో లోటుపాట్లు సరిచేసుకుంటారు.

By జ్యోత్స్న  Published on  9 March 2023 1:37 AM GMT
Daily Horoscope,Astrology,Rasi Phalalu

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

మేషం : నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. వ్యాపార వ్యవహారాలలో లోటుపాట్లు సరిచేసుకుంటారు. గృహమున సంతాన శుభకార్య ప్రస్తావన వస్తుంది. ఆర్థిక పురోగతి కలుగుతుంది. అప్రయత్నంగా కొన్ని పనులు పూర్తి అవుతాయి. దూర ప్రాంత దైవ దర్శనాలు చేసుకుంటారు.

వృషభం : దైవచింతన పెరుగుతుంది. ఋణ ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ముఖ్యమైన పనులు మందగిస్తాయి. కుటుంబమున కొందరి మాటలు వివాదాస్పదంగా మారతాయి. ధన పరంగా ఇబ్బందులు తప్పవు. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి.

మిధునం : ఆప్తులతో మాటపట్టింపులు కలుగుతాయి. చేపట్టిన వ్యవహారాలు మరింతగా మందగిస్తాయి. మానసికంగా సమస్యలు కొంత బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలలో నిరుత్సహ వాతావరణం ఉంటుంది. ఆదాయమార్గాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో ఇతరుల నుండి విమర్శలు పెరుగుతాయి.

కర్కాటకం : ఉద్యోగమున ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. వ్యాపారమున నూతన ఆలోచనలతో ముందుకు సాగుతారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. సంఘంలో పెద్దల నుండి ఆహ్వానాలు అందుతాయి .నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

సింహం : సంఘంలో పెద్దల పరిచయాలు అంతగా కలసిరావు. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత చికాకు పరుస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగమున శ్రమకు తగిన గుర్తింపు లభించదు. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆదాయానికి ఇబ్బంది తప్పదు . ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

కన్య : దైవ కార్యక్రమాలకు ధనం అందిస్తారు. స్ధిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలలో మెరుగైన లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అనుకూలత పరిస్థితులుంటాయి. చుట్టుపక్కల వారితో వివాదాలలో పై చేయి సాధిస్తారు. రాజకీయ సభ సమావేశలకు హాజరవుతారు.

తుల : కుటుంబసభ్యుల ఆరోగ్య విషయంలో వైద్యుని సంప్రదించడం మంచిది. చేపట్టిన పనులు అతికష్టం మీద పూర్తి అవుతాయి. వృత్తి,ఉద్యోగాలలో ప్రతికూల పరిస్థితులు వేదిస్తాయి. స్థిరస్తి సంభందిత విషయాలలో వివాదాలు తప్పవు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు అంతగా కలసిరావు.

వృశ్చికం : బంధు మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపార వ్యవహారాలలో మీ అంచనాలు నిజం అవుతాయి. ఆర్ధిక ఇబ్బందుల నుండి కొంత వరకు బయటపడతారు.

ధనస్సు : వృత్తివ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులు నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేసి లాభాలు పొందుతారు. ఉద్యోగులు అధికారుల ఆదరణ పెరుగుతుంది. మిత్రులతో శుభకార్యాలకు హాజరవుతారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.

మకరం : ఇతరులతో తొందరపడి మాట్లాడం మంచిది కాదు. దూర ప్రయాణ సూచనలున్నవి. ఉద్యోగాలలో సహోద్యోగుల ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. బంధు వర్గం వారితో మాటపట్టింపులంటాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి.

కుంభం : వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. కొన్ని పనులు అనుకున్న సమయానికి పూర్తికావు ఖర్చులకు తగిన ఆదాయం లభించదు. ఉద్యోగమున స్థానచలన సూచనలున్నవి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నూతన ఋణయత్నాలు వ్యర్ధంగా మిగులుతాయి.

మీనం : అన్ని రంగాల వారికి లాభదాయకంగా ఉంటుంది. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో సమస్యలు తొలగుతాయి. దీర్ఘ కాలిక వివాదాల నుండి ఉపశమనం పొందుతారు.

Next Story