దిన ఫలితాలు: ఆస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు

ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి.

By జ్యోత్స్న  Published on  31 Aug 2024 1:00 AM GMT
దిన ఫలితాలు: ఆస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు

మేషం:

ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి. దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. బంధుమిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వ్యాపారులకు చిక్కులు తప్పవు. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి.

వృషభం:

ఆస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారమున ఆశించిన లాభాలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. విద్యార్థులకు విదేశీ ప్రయాణ ప్రయత్నాలలో కీలక సమాచారం అందుతుంది.

మిధునం:

ఉదర అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారులకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులు ముందుకు సాగవు. గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఉద్యోగమున తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు.

కర్కాటకం:

గృహ వాతావరణం సందడిగా ఉంటుంది. వ్యాపారులకు సకాలంలో పెట్టుబడులు అందుతాయి. అవసరానికి సన్నిహితుల సాయం పొందుతారు. స్థిరస్తి విషయాలలో చికాకులు తొలగుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. ఉద్యోగులకు దీర్ఘ కాలిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.

సింహం:

ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆరోగ్యపరంగా వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారులకు గందరగోళ పరిస్థితులుంటాయి ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి.

కన్య:

వృత్తి వ్యాపారాలు అనుకున్నది సాధిస్తారు. దైవచింతన పెరుగుతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగ యత్నాలలో విజయం సాధిస్తారు. సంఘంలో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి ఉన్నపటికీ నిదానంగా పూర్తిచేస్తారు.

తుల:

వాహన వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు అందుతాయి , స్థిరస్తి కొనుగోలు చేస్తారు . ఆలయ దర్శనం చేసుకుంటారు. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహారిస్తారు ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగులకు అధికారుల అండదండలతో నూతన అవకాశములు లభిస్తాయి.

వృశ్చికం:

ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారమున స్వల్ప లాభాలు అందుతాయి. బంధు మిత్రులతో మీ మాటతో విబేదిస్తారు. ఉద్యోగం వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆర్థిక వాతావరణం చికాకుగా ఉంటుంది.

ధనస్సు:

దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. సోదరులతో స్థిరస్తి వివాదాలు కలుగుతాయి. అవరానికి చేతిలో డబ్బు నిలువ ఉండదు. ఉద్యోగులకు సహోద్యోగులతో మాటపట్టింపులు కలుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

మకరం:

విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. చేపట్టిన పనుల్లో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం యోగం ఉన్నది.

కుంభం:

మిత్రుల నుంచి శుభవర్తమానాలు అందుతాయి. భూ వివాదాలు పరిష్కారమౌతాయి. వృత్తి వ్యాపారములు ఉత్సాహంగా సాగుతారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. నిరుద్యోగుల ఊహలు నిజమవుతాయి. ఉద్యోగులకు ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. విద్యార్థుల కష్టం ఫలిస్తుంది.

మీనం:

వృధా ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. అనారోగ్య విషయంలో స్వల్ప ఇబ్బందులుంటాయి. ప్రయాణాల్లో ఆకస్మిక మారులుంటాయి. వ్యాపారులకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఉద్యోగమున పరిస్థితులు అంతగా అనుకుంలించవు.

Next Story