దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో ఆర్థిక ప్రగతి

సన్నిహితులతో ఊహించని మాటపట్టింపులు కలుగుతాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. ఆర్ధికంగా కొంత నిరాశ తప్పదు.

By జ్యోత్స్న  Published on  30 Aug 2023 12:39 AM GMT
horoscope, Astrology, Rasiphalalu

దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో ఆర్థిక ప్రగతి 

మేషం: ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆర్థికంగా పురోగతి కలుగుతుంది ఉద్యోగాలలో అధికారులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. వ్యాపారాలలో అనుకొన్న సమయానికి నూతన పెట్టుబడులు అందుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

వృషభం: బంధుమిత్రులతో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరప్రాంత సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో నూతన లాభాలు అందుతాయి.

మిధునం: వృత్తి వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారమున భాగస్వాములతో వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక సమస్యలు కలుగుతాయి.

కర్కాటకం: బంధుమిత్రులతో ఊహించని కలహాలు కలుగుతాయి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆలోచన లో స్థిరత్వం లోపిస్తుంది. ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన నిరాశ కలిగిస్తుంది. నిరుద్యోగులకు శ్రమకు తగిన ఫలితం కనిపించదు.

సింహం: ఆర్ధిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. సంతాన విద్యా విషయాల్లో శుభవార్తలు అందుతాయి. దూరపు బంధువులతో గృహమున సంతోషంగా గడుపుతారు. ఉద్యోగం వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. విలువైన గృహాపకరణాలు కొనుగోలు చేస్తారు.

కన్య: చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఇంటా బయట పరిచయాలు పెరుగుతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. నూతన వ్యాపారమునకు పెట్టుబడులు అందుతాయి. వ్యాపార వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగమున దీర్ఘకాలిక సమస్యలు నుండి ఉపశమనం లభిస్తుంది.

తుల : గృహమున కొందరి ప్రవర్తన వలన మానసిక సమస్యలు తప్పవు. ఉద్యోగాలలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. వ్యాపారాలు మందగిస్తాయి. ప్రారంభించిన పనులలో అవరోధాలు కలుగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. సన్నిహితుల నుండి కీలక సమాచారం సేకరిస్తారు.

వృశ్చికం: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. చిన్ననాటి మిత్రులతో ఒక వ్యవహారంలో మాటపట్టింపులు కలుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు.

ధనస్సు: భూ సంబంధిత క్రయవిక్రయాల లాభసాటిగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో మీ విలువ మరింత పెరుగుతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలను అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా సాగుతుంది. బంధు మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి.

మకరం: వృత్తి వ్యాపారాలలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. ఉద్యోగమున అదనపు బాధ్యతలు పెరుగుతాయి. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. గృహమున కొందరి మాటలు చికాకు కలిగిస్తాయి. అవసరానికి చేతిలో డబ్బు నిలవక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

కుంభం: ధన పరంగా సమస్యలను అధిగమిస్తారు. నిరుద్యోగ యత్నాలు అనుకూల ఫలితాన్నిస్తాయి. సంఘంలో విశేషమైన ఆదరణ పెరుగుతుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారమున స్వంత నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో ఆర్థిక ప్రగతి సాధిస్తారు.

మీనం: సన్నిహితులతో ఊహించని మాటపట్టింపులు కలుగుతాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. ఆర్ధికంగా కొంత నిరాశ తప్పదు. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో చర్చలు విఫలమవుతాయి.

Next Story