ఉద్యోగంలో గంద‌ర‌గోళం, ఆరోగ్య విష‌యంలో నిర్ల‌క్ష్యం త‌గ‌దు

మాతృ వర్గ బంధువర్గంతో అకారణ వివాదాలు కలుగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి

By జ్యోత్స్న  Published on  30 March 2023 7:23 AM IST
Daily Horoscope,Astrology,Rasi Phalalu

ప్ర‌తీకాత్మ‌క చిత్రం



మేషం : మాతృ వర్గ బంధువర్గంతో అకారణ వివాదాలు కలుగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో వ్యయప్రయాసలు అధికమౌతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు.

వృషభం : ఆదాయం మరింత ఆశాజనకంగా ఉంటుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. అవసరానికి సన్నిహితుల సహాయ సహకారాలు అందుతుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపార ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి.

మిధునం : బంధువులు, మిత్రుల నుంచి రుణాల ఒత్తిడులు అధికమవుతాయి. దూర ప్రయాణం సూచనలు ఉన్నవి. ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం అవుతుంది. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. స్థిరస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి.

కర్కాటకం : స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఇంటాబయట పరిస్థితులు అనుకూలిస్తాయి. గృహమున సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. ఉద్యోగస్థులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.

సింహం : దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు చికాకు పరుస్తాయి. బందు మిత్రులతో మిత్రులతో అకారణ విభేదాలు కలుగుతాయి. దైవ చింతన పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

కన్య : ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. విందు వినోద కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. దీర్ఘ కాలిక రుణ బాధల నుండి ఉపశమనం పొందుతారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి.

తుల : విలువైన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు.

వృశ్చికం : మిత్రుల నుంచి రుణ ఒత్తిడులు అధికమవుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు మందగిస్తాయి. కుటుంబంలో వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహ పరుస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది.

ధనస్సు : చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ముఖ్యమైన వ్యవహారాలలో ఎంతో శ్రమపడ్డారు. ఫలితం కనిపించదు సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి తప్పదు.

మకరం : సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు ఆశించిన విధంగా ఉంటాయి. గృహమును కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

కుంభం : ఆర్థిక ఇబ్బందులు వలన నూతన ఋణప్రయత్నాలు చేయవలసి వస్తుంది. ప్రయాణాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు.

మీనం : ఇంటా బయట మీ మాటకు విలువ తగ్గుతుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. బంధు మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఉద్యోగయత్నాలు మీరు చాలా వస్తాయి.

Next Story