దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి చేపట్టిన పనులలో విజయం

సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు.

By జ్యోత్స్న  Published on  30 Jan 2024 12:45 AM GMT
horoscope, Astrology, Rasiphalalu

దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి చేపట్టిన పనులలో విజయం

మేషం: వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి. నూతన ఋణ ప్రయత్నాలు ఫలించవు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు పెట్టె విషయంలో జాగ్రత్త అవసరం. సంతాన ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. దూరప్రయాణాలు వాయిదా పడుతాయి.ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది.

వృషభం: ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది . వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. మాతృ వర్గం వారితో అకారణ వివాదాలు కలుగుతాయి. ఉద్యోగులకు శ్రమ తప్పదు గృహ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ప్రయాణాలు చివరి నిమిషంలో వాయిదా పడతాయి. ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి.

మిధునం: సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. బంధు వర్గం నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగమున పురోగతి సాధిస్తారు.

కర్కాటకం: దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ముఖ్యమైన వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. వ్యాపారాలు సామాన్యం సాగుతాయి. ఆర్థిక పరంగా స్వల్ప ఇబ్బందులు తప్పవు. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి.

సింహం: ఉద్యోగులకు పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాలలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. ఆదాయపరంగా ఇబ్బంది ఉన్నప్పటికీ అవసరానికి ధన సహాయం లభిస్తుంది. చేపట్టిన పనులు వాయిదా పడతాయి.

కన్య: ఉద్యోగులకు అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి లభించదు. నూతన ప్రయత్నాలు ఫలించవు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు.

తుల: సమాజంలో గౌరవ మర్యాదలు లోటుండదు. వ్యాపారాలు గతం కంటే మెరుగవుతాయి. ఆర్థికంగా ఇబ్బందులు అధిగమించి ముందుకు సాగుతారు. ఉద్యోగాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనులు అనుకూలంగా సాగుతాయి.

వృశ్చికం: నూతన వ్యాపారాలు ప్రారంభించటానికి అవరోధాలు తొలగుతాయి. ఆప్తుల నుండి కీలక విషయాలు సేకరిస్తారు. ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. దూరపు బంధువులు ఆగమనం కలిగిస్తుంది.

ధనస్సు: భూవివాదాలు పరిష్కారమౌతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. మిత్రుల నుంచి ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి. ప్రయాణాలు వీలైనంత వాయిదా వెయ్యడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

మకరం: వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. పాత మిత్రులను కలుసుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. సన్నిహితుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

కుంభం: నూతన వాహనయోగం ఉన్నది. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగమున అధికారుల అనుగ్రహం కలుగుతుంది. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి.

మీనం: కుటుంబ సభ్యులతో విందువినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. ఇంటాబయట ప్రోత్సాహకార వాతావరణం ఉంటుంది. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. శత్రు సమస్యలు నుండి తెలివిగా బయటపడతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది.

Next Story