దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి అనుకూలంగా ఆర్ధిక పరిస్థితి
ఆరోగ్యం విషయంలో చికాకులు తప్పవు. వాహనాలు ప్రయాణ విషయంలో జాగ్రత్త అవసరం ఉద్యోగులకు నూతన సమస్యలు కలుగుతాయి.
By జ్యోత్స్న Published on 29 Nov 2023 12:46 AM GMTదిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి అనుకూలంగా ఆర్ధిక పరిస్థితి
మేషం: ఆరోగ్యం విషయంలో చికాకులు తప్పవు. వాహనాలు ప్రయాణ విషయంలో జాగ్రత్త అవసరం ఉద్యోగులకు నూతన సమస్యలు కలుగుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు మధ్య స్వల్ప విభేదాలు ఉంటాయి. ఆర్ధిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది.
వృషభం: అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. దైవ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆర్ధిక పరిస్థితి అనుకూలిస్తుంది. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది. నూతన కార్యక్రమాల ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి.
మిధునం: గృహమున పెద్దల ఆరోగ్య విషయం ఆందోళన కలిగిస్తుంది. ప్రయాణాలు వాయిదా వెయ్యడమంచిది. ఇతరులకు ధన వ్యవహారాలలో మాట ఇవ్వకపోవడం మంచిది. వ్యాపారమున ఎంతగా శ్రమించినా ఫలితం లభించక నిరాశ కలుగుతుంది. బంధువులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి.
కర్కాటకం: వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆర్ధిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. నూతన ఆలోచనలు అమలు చేస్తారు. ప్రారంభించిన పనులు నిదానంగా సాగుతాయి. మొండి బాకీలు తీర్చగలుగుతారు.
సింహం: నూతన ఉద్యోగ అవకాశములు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు కలసివస్తాయి. విలువైన వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగమున అధికారుల అనుగ్రహం కలుగుతుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
కన్య: వృధా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. రాజకీయ సభ సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. ఆర్ధిక పరిస్థితి కొంత వరకు అనుకూలిస్తుంది. ఉద్యోగ విషయమై అధికారులతో చర్చలు అంతగా అనుకూలించవు. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి.
తుల: ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. వాహన ప్రయాణాలు వాయిదా పడుతాయి. వ్యాపారమున భాగస్థులతో జాగ్రత్తగా మాట్లాడటం మంచిది. దూర ప్రాంతాల బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.
వృశ్చికం : దాయాదులతో వివాదాలకూ దూరంగా ఉండటం మంచిది. చేపట్టిన పనులలో జాప్యం కలిగిన సకాలంలో పూర్తి చేస్తారు. బంధు మిత్రుల ప్రవర్తన కొంత చికాకు పరుస్తుంది. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగమున కొంత అనుకూలత కలుగుతుంది. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి.
ధనస్సు: ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. నిరుద్యోగులు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. వృత్తి ఉద్యోగమున ఆశించిన స్థానచలనాలు కలుగుతాయి. కుటుంబసభ్యులతో సంఖ్యతగా వ్యవహారిస్తారు. ప్రయాణాలలో కొంత జాగ్రత్త అవసరం పాత ఋణాలు వసూలవుతాయి.
మకరం: నిరుద్యోగులకు కీలక సమాచారం అందుతుంది. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. స్ధిరాస్తి క్రయ విక్రయాలు వాయిదా పడుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులకు అదనపు పని బాధ్యతలు చికాకు కలిగిస్తాయి.
కుంభం: శత్రువులు సైతం మిత్రులుగా మరి సహాయ పడతారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి తెలివిగా బయటపడతారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సజావుగా సాగుతాయి.
మీనం: నూతన కార్యక్రమాలు ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. సోదరుల నుంచి కీలక సమాచారం అందుతుంది. రావలసిన సొమ్ము సకాలంలో. చేతికి అందుతుంది. వృత్తి, వ్యాపారాలలో ఎదురైనా సమస్యలు తెలివిగా అధిగమిస్తారు. సమాజంలో ప్రముఖుల పరిచయాలు ఉత్సహాన్నిస్తాయి.