దినఫలాలు: నేడు ఈ రాశి వారికి అంతా శుభమే

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సన్నిహితుల నుండి వివాద విషయమై కీలక సమాచారం అందుతుంది. ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం ఉండదు.

By జ్యోత్స్న  Published on  28 Sep 2023 12:45 AM GMT
horoscope, Astrology, Rasiphalalu

దినఫలాలు: నేడు ఈ రాశి వారికి అంతా శుభమే

మేషం: సోదరులతో వివాదాలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఆస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

వృషభం: రావలసిన సొమ్ము సకాలంలో వసూలవుతాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఉన్నప్పటికీ సకాలంలో పూర్తి చేస్తారు. ఆప్తుల నుండి ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి.

మిధునం: దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం వలన తగిన విశ్రాంతి లభించదు. ఇంటా బయట చికాకులు పెరుగుతాయి. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. నిరుద్యోగుల ప్రయత్నాలకు నిరాశ తప్పదు. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో మధ్యమ ఫలితాలు అందుతాయి.

కర్కాటకం: చేపట్టిన పనులులో శ్రమాధిక్యత పెరుగుతుంది. వ్యాపార వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. కీలక వ్యవహారాలలో కుటుంబ మాట పట్టింపులు ఉంటాయి. నిరుద్యోగుల ప్రయత్న లోపం వలన లభించిన అవకాశాలు చేజారుతాయి. ధన వ్యవహారాలలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి.

సింహం: నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. మిత్రులతో చర్చలు ఫలిస్తాయి. వ్యాపారాలలో నష్టాలు భర్తీ అవుతాయి. గృహమున సంతాన శుభకార్యములు నిర్వహిస్తారు. అవసరానికి చేతికి డబ్బు అందుతుంది. ఉద్యోగాలలో సమస్యల నుండి బయట పడతారు.

కన్య: రావలసిన ధనం చేతికి అందుతుంది. కుటుంబ సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. నూతన వస్తు వాహనం కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆప్తులనుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది.

తుల: ఋణదాతల ఒత్తిడి నుండి బయటపడటానికి నూతన ఋణాలు చేస్తారు. జీవిత భాగస్వామితో ఆలయాలు సందర్శిస్తారు. చేపట్టిన పనుల్లో స్వల్ప అవరోధాలుంటాయి. కుటుంబ సభ్యులతో దూరప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలలో ఆర్థిక నష్టాలుంటాయి. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.

వృశ్చికం: నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహం కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడులు పెరుగుతాయి. ఉద్యోగమున అప్పగించిన బాధ్యతలు నిర్వహించడంలో విఫలమౌతారు. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఆస్తి వ్యవహారాలలో వివాదాలు కలుగుతాయి.

ధనస్సు: సంఘంలో ప్రముఖుల నుండి విశేషమైన సహకారం లభిస్తుంది. వివాదాలకు సంభందించి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందుతాయి. మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో తెలివిగా సమస్యల నుండి బయట పడతారు .

మకరం: వ్యాపారాలు మరింత మందగిస్తాయి. ఉద్యోగులకు సహోద్యోగులతో మనస్పర్థలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. నూతన ఋణప్రయత్నాలు కలసిరావు.

కుంభం: ఇంటా బయట కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వృత్తి వ్యాపారమున వ్యవహార అనుకూలత కలుగుతుంది. కొన్ని సంఘటనలు గుర్తు చేసుకుని బాధపడతారు. ఉద్యోగస్థులకు నూతన అవకాశములు లభిస్తాయి. ఉద్యోగమున అనుకూల మార్పులు ఉంటాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.

మీనం: ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సన్నిహితుల నుండి వివాద విషయమై కీలక సమాచారం అందుతుంది. ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం ఉండదు. చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. కొన్ని విషయాలలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. సంతాన శుభకార్యలు విషయమై ప్రస్తావన వస్తుంది.

Next Story