నేడు ఈ రాశి వారికి ప్రయాణాలలో ఆకస్మిక ధనప్రాప్తి

మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలలో కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. దూరప్రయాణ సూచనలున్నవి.

By జ్యోత్స్న  Published on  28 July 2023 12:30 AM GMT
horoscope, astrology, Rasiphalalu

నేడు ఈ రాశి వారికి ప్రయాణాలలో ఆకస్మిక ధనప్రాప్తి

మేషం: బంధు మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో స్వంత నిర్ణయాలు కలిసిరావు. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. మిత్రులతో ఆలయ సందర్శనం చేసుకుంటారు. ఉద్యోగంలో ఒడిదుడుకులు అధికమవుతాయి. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. ఆర్థిక వాతావరణం నిరాశ కలిగిస్తుంది.

వృషభం: భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. రాజకీయ వర్గాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

మిధునం: నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల అండదండలతో సమస్యలు పరిష్కరించుకుంటారు. గృహమునకు బంధు మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

కర్కాటకం: బంధు మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. సంతాన ఆరోగ్య విషయమై వైద్య సంప్రదింపులు చేస్తారు. వ్యాపారంలో సొంత నిర్ణయాలు చేయడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో మరింత ఓర్పుతో వ్యవహరించాలి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. నూతన ఋణ ప్రయత్నాలు అంతగా కలిసిరావు.

సింహం: ఆర్ధిక విషయాలలో జాగ్రత్త అవసరం. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. సోదరులతో మాటపట్టింపులు ఉంటాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. నిరుద్యోగులు ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.

కన్య: నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. ఋణగ్రస్తులు నుండి ధనం వసూలు అవుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆర్ధికంగా మరింత పురోగతి సాధిస్తారు. ఉద్యోగమున అధికారుల సహాయ సహకారాలతో కొన్ని సమస్యలు తొలగుతాయి.

తుల: నూతన ఋణ ప్రయత్నాలు అంతగా కలసి రావు. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. బంధు మిత్రులతో అనుకోని విభేదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.

వృశ్చికం: ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. బంధువుల నుండి గృహోపకరణాలు బహుమతులుగా పొందుతారు. ఆర్థికంగా అనుకూలత కలుగుతుంది.

ధనస్సు: ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. వృత్తి వ్యాపారాలలో సమస్యలు మానసికంగా చికాకు కలిగిస్తాయి. ఉద్యోగమున ఆకస్మిక స్థానచలన సూచనలు ఉన్నవి.

మకరం: గృహమునకు చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగమున ఉన్నతాధికారులతో సఖ్యతగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి.

కుంభం: వృత్తి వ్యాపారాలలో అనుకూలత పెరుగుతుంది. ఉద్యోగమున అధికారులతో సమస్యలు తొలగి ఊరట పొందుతారు. ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది. సన్నిహితులతో శుభకార్యాలకు హాజరవుతారు. ప్రయాణాలలో ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.

మీనం: మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలలో కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. దూరప్రయాణ సూచనలున్నవి. చేపట్టిన పనులలో శ్రమ మరింత అధికం అవుతుంది. వృత్తి ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి. కొన్ని వ్యవహారాలలో మానసిక అనారోగ్య సమస్యలు కలుగుతాయి.

Next Story