దిన ఫలాలు: నేడు వీరికి తొందరపాటు పనిచేయదు

వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు అధికమౌతాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. చేపట్టిన పనుల్లో తొందరపాటు పనిచేయదు.

By జ్యోత్స్న  Published on  27 Dec 2023 12:34 AM GMT
horoscope, Astrology, Rasiphalalu

దిన ఫలాలు: నేడు వీరికి తొందరపాటు పనిచేయదు

మేషం: చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో సొంత నిర్ణయాలతో ముందుకు సాగుతారు. వృత్తి, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలువైన సమాచారం అందుతుంది.

వృషభం: వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు అధికమౌతాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. చేపట్టిన పనుల్లో తొందరపాటు పనిచేయదు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

మిధునం: స్థిరస్తి కొనుగోలు చేస్తారు. సమాజంలో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సంతాన విద్య ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి. సన్నిహితులతో వివాదాలు పరిష్కారమౌతాయి. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

కర్కాటకం: కుటుంబసభ్యులతో స్వల్పవివాదాలు ఉంటాయి. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన పనులు వాయిదా వేస్తారు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.

సింహం: వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. నూతన మిత్రుల పరిచయం ఉత్సాహనిస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. మిత్రుల నుండి శుభవార్తలు వింటారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి.

కన్య: ఆస్తి విషయాలలో ఒప్పందాలు వాయిదా పడుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. పాతమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.

తుల: చిన్ననాటి మిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి.

వృశ్చికం: ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు ఉండవచ్చు. విద్యార్థులకు కొంత నిరుత్సాహం తప్పదు ధనపరంగా ఇబ్బందులు తప్పవు. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది.

ధనస్సు: వృత్తి, వ్యాపారాలలో అనుకూల పరిస్థితులుంటాయి. కొత్త పనులు చేపడతారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. దైవ చింతన పెరుగుతుంది. అధికారుల నుండి విమర్శలు తప్పవు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

మకరం: వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు. నిరుద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థిక పురోగతి కలుగుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

కుంభం: ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబ వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో ఊహించని మార్పులు ఉంటాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆర్ధిక సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు ఉంటాయి.

మీనం: కుటుంబంలో చికాకులు తప్పవు. వృత్తి, వ్యాపారాలలో ఊహించని మార్పులుంటాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో నిరుత్సాహం తప్పదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధువులతో అకారణ వివాదాలు కలుగుతాయి. కొందరి ప్రవర్తన చికాకు పరుస్తాయి.

Next Story