దిన ఫలాలు: ఈ రాశి వారికి ఆకస్మిక ధన వ్యయ సూచనలు
వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహం కలిగిస్తాయి. ఆకస్మిక ధన వ్యయ సూచనలు ఉన్నవి. ఆరోగ్యం మందగిస్తుంది. ముఖ్యమైన పనులు
By జ్యోత్స్న Published on 26 April 2023 1:30 AM GMTదిన ఫలాలు: ఈ రాశి వారికి ఆకస్మిక ధన వ్యయ సూచనలు
మేషం: కుటుంబ వ్యవహారాలలో నిర్ణయాలు మార్చుకుంటారు. దీర్ఘ కాలిక అనారోగ్యాల నుండి ఉపశమనం కలుగుతుంది. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమిస్తారు. వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.
వృషభం: ఇంటా బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి. నూతన కార్యక్రమాలు చేపడతారు. సన్నిహితులతో కుటుంబమున ఉత్సహంగా గడుపుతారు. మిత్రులతో విహారయాత్రలలో పాల్గొంటారు. చేపట్టిన పనులలో కార్యజయం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
మిధునం: ఋణ సమస్యలు అధికమై మానసిక ఇబ్బందులు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధు మిత్రులతో మనస్పర్ధలు కలుగుతాయి. రుణయత్నాలు చేస్తారు. ప్రయాణాలు ఇబ్బందులు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.
కర్కాటకం: నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. పాత మిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో పురోగతి కనిపిస్తుంది.
సింహం: చేపట్టిన వ్యవహారాలలో సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల సహాయం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు. ఉద్యోగమునకొన్ని వ్యవహారాలలో చిక్కులు అధిగమిస్తారు.
కన్య: ఆప్తుల వలన కొన్ని విషయాలు తెలుసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. కొన్ని పనులలో సమస్యలు తొలగి ఊరట కలుగుతుంది. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభాల బాట పడతాయి.
తుల: ధన, వస్తు,వాహన లాభాలు ఉన్నవి. సంఘంలో పెద్దల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. కొన్ని వివాదాల నుండి తెలివితేటలతో బయట పడగలుగుతారు. వ్యాపారాలలో ఆశించిన ఫలితాలను పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో ఉన్నత అవకాశాలు లభిస్తాయి.
వృశ్చికం: చేపట్టిన వ్యవహారాల్లో అవాంతరాలు ఏర్పడతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వృత్తి, ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి. వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాల వలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహంగా ఉంటాయి.
ధనస్సు: ఇంటాబయట ప్రతికూల వాతావరణం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలలో స్వల్ప మార్పులు ఉంటాయి. ఋణ ప్రయత్నాలు అనుకూలించవు. దూరప్రయాణంలో వాహన ఇబ్బందులు ఉంటాయి. ఆరోగ్య విషయమై వైద్య సహాయం అవసరం అవుతుంది.
మకరం: స్థిరాస్తి లాభం కలుగుతుంది. చేపట్టిన పనులు నిదానంగా పూర్తిచేస్తారు. వ్యాపార వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. దైవారాధన వలన శుభ ఫలితాలు కలుగుతాయి. వృత్తి,వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.
కుంభం: ముఖ్యమైన పనులలో కావాల్సిన వారి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆత్మీయులు నుండి ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలు బాగుంటాయి. వ్యాపార, ఉద్యోగాలలో మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. సంతాన విద్యా విషయాలు సంతృప్తి కలిగిస్తాయి.
మీనం: వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహం కలిగిస్తాయి. ఆకస్మిక ధన వ్యయ సూచనలు ఉన్నవి. ఆరోగ్యం మందగిస్తుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరత్వం ఉండవు. పనులు మందకొడిగా సాగుతాయి.