దిన ఫలాలు: నేడు ఈ రాశివారికి అన్నీ శుభాలే
సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు. వ్యాపారం ఉత్సాహంగా సాగుతుంది. దగ్గరి వారి నుండి సమయానికి ఆర్ధిక సహాయం అందుతుంది. దీర్ఘకాలిక రుణాల నుండి ఉపశమనం కలుగుతుంది.
By జ్యోత్స్న Published on 25 July 2024 6:17 AM ISTదిన ఫలాలు: నేడు ఈ రాశివారికి అన్నీ శుభాలే
మేషం: సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు. వ్యాపారం ఉత్సాహంగా సాగుతుంది. దగ్గరి వారి నుండి సమయానికి ఆర్ధిక సహాయం అందుతుంది. దీర్ఘకాలిక రుణాల నుండి ఉపశమనం కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. సమాజంలో పెరు ప్రఖ్యాతులు పెరుగుతాయి.
వృషభం: ముఖ్యమైన పనులలో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి విజయం సాధిస్తారు.చుట్టుపక్కల వారితో ఉన్న స్థిరాస్తి వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి.వృత్తి ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి,వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు నిరుద్యోగులకు నూతన అవకాశాలు వస్తాయి.
మిధునం: ఆలయ సందర్శన చేసుకొంటారు. సంతాన విషయంలో ఊహించని సంఘటనలు ఎదుర్కొంటారు. ఋణదాతల ఒత్తిడి అధికమై మానసిక బాధలు ఎదుర్కొంటారు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. స్థిరాస్తి వ్యవహారాలు అతి కష్టం మీద పూర్తి అవుతాయి. వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి.
కర్కాటకం: కుటుంబ పెద్దలతో మాటపట్టింపులుంటాయి. ఉద్యోగాల్లో అధికారుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. మిత్రులతో భేదాభిప్రాయాలు వస్తాయి. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేయలేరు. ఇంటా బయట ఒత్తిడి అధికమై ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
సింహం: ఆర్ధిక పరంగా చేసే ప్రయత్నాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి. బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. సంఘంలో పెరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అందరితో సఖ్యతగా వ్యవహరించి ఆకట్టుకుంటారు. వస్తు, వాహనాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణ సూచనలు కలవు.
కన్య: సమయానికి తగిన ధన సహాయం అందుతుంది. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభకు అధికారుల నుండి మన్నలను అందుకుంటారు.
తుల: గృహమున విలువైన పత్రములు విషయంలో జాగ్రత్త వ్యవహరించాలి. వ్యాపారాలలో స్వంత నిర్ణయాలు కలిసిరావు. ఉద్యోగమున విధులు సరిగా నిర్వర్తించలేక పై వారి నుండి మాట పడవలసి వస్తుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్య సమస్యలు భాదిస్తాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలో స్థిరత్వం ఉండదు.
వృశ్చికం: నూతన వాహనం కొనుగోలు ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. బంధు మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. అవసరానికి ఆర్ధిక సహాయం అందక ఇబ్బంది పడతారు. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి.
ధనస్సు: అన్ని వైపుల నుండి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కీలకమైన పనులలో ధైర్యంగా నిర్ణయాలను తీసుకుని లాభపడతారు. వస్త్రాభరణాలు కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకొంటారు.
మకరం: అనవసర వస్తువులపై ధనవ్యయం చేస్తారు. సమయానికి నిద్రహారాలు ఉండవు. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది. ఇతరుల నుండి విమర్శలు ఎదురవుతాయి. ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. బంధుమిత్రులతో విభేదాలు ఉంటాయి.
కుంభం: సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధు మిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులు పొందుతారు. నిరుద్యోగులకు ఉత్సాహంగా సాగుతుంది. విందు వినోద కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. సంతానం విషయాలు సంతృప్తినిస్తాయి.
మీనం: ప్రయాణాలలో మార్గ అవరోధాలు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు మంచివి కావు. ఊహించని విధంగా ఖర్చులు అధికమవుతాయి. ఇంటా బయట అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.