దిన ఫలితాలు : ఆ రాశి వారికి నూతన వాహనయోగం

వ్యాపార వ్యవహారాల్లో పెద్దలు సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి.

By జ్యోత్స్న  Published on  24 Jun 2023 3:54 AM GMT
horoscope, astrology, Rasiphalalu

దిన ఫలితాలు : ఆ రాశి వారికి నూతన వాహనయోగం

మేషం:

ఉద్యోగయత్నాలు మందకొడిగా సాగుతాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత కలుగుతుంది. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడులు పెరుగుతాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో కొన్ని సమస్యలు తప్పవు. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.

వృషభం:

చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు అధికమవుతాయి. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది. నూతన రుణాలు చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.

మిధునం:

వ్యయప్రయాసలతో కాని పనులు పూర్తి కావు. దూరపు బంధువుల నుండి ఆసక్తికర సమాచారం సేకరిస్తారు. బంధువులతో వివాదాలు చికాకు పరుస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. కొన్ని వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు.

కర్కాటకం:

ఆరోగ్య ఈ విషయంలో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులలో శ్రమ అంతగా ఫలించదు. బంధువులతో వివాదాలు తప్పవు. మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి. పాత రుణాలు తీర్చడానికి నూతన ప్రయత్నాలు చేస్తారు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.

సింహం:

సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది. స్థిరస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. విందువినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి.

కన్య:

వ్యాపార, ఉద్యోగాలలో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులు మందగిస్తాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. దైవదర్శనాలు చేసుకుంటారు.

తుల:

ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఇంటా బయట ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. సన్నిహితులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాదిస్తారు.

వృశ్చికం:

రాజకీయ ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారవుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో పాత జ్ఞాపకాలను పంచుకుంటారు.

ధనస్సు:

దైవచింతన పెరుగుతుంది. ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. ముఖ్యమైన పనుల్లో ఊహించని ఆటంకాలు కలుగుతాయి. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నూతన ఋణప్రయత్నాలు చేస్తారు ఆత్మీయులతో చిన్నపాటి వివాదాలతో తప్పవు.

మకరం:

వ్యాపార వ్యవహారాల్లో పెద్దలు సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో కొన్ని వివాదాలు చికాకు పరుస్తాయి. ఉద్యోగాలలో కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

కుంభం:

నూతన వాహనయోగం ఉన్నది. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార ఉద్యోగాలలో నూతన ఆశలు చిగురిస్తాయి. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక లావాదేవీలు ప్రోత్సాహకరంగా సాగుతాయి.

మీనం:

నూతన వాహన యోగం ఉన్నది. సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం. స్థిరస్తి కొనుగోలుకు ఆటంకాలు తొలగుతాయి. వ్యాపార విస్తరణకు అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి.

Next Story