నేడు ఈ రాశి వారు వాహన ప్రయాణ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిందే

వాహన ప్రయాణ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. అకారణంగా ఇతరులతో వివాదాలు కలుగుతాయి. ఋణ సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగస్తులకు ఆకస్మిక స్థానచలన సూచనలు ఉన్నవి.

By జ్యోత్స్న  Published on  23 Oct 2024 6:13 AM IST
horoscope, Astrology, Rasiphalalu

నేడు ఈ రాశి వారు వాహన ప్రయాణ విషయంలో అప్రమత్తం ఉండాల్సిందే

మేషం:

చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసికంగా సమస్యలు కలుగుతాయి. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. ఆర్థికంగా స్థిరత్వం ఉండదు. వృత్తి ఉద్యోగ విషయంలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వ్యాపారాలు మందగిస్తాయి.

వృషభం:

సోదరులతో స్థిరస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయగలుగుతారు.దూరప్రాంత బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపార వ్యవహారాలలో భాగస్థులతో సమస్యలను సర్దుబాటు చేసుకుంటారు.

మిధునం:

అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. చేపట్టిన పనులలో ఎంత కష్టపడినా ఫలితం అంతంత మాత్రంగా ఉంటుంది. కొన్ని వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాతో ముందుకు సాగడం మంచిది. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు అందుకుంటారు. ఉద్యోగ విషయంలో తొందరపాటు మంచిది కాదు.

కర్కాటకం:

ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. దూర ప్రయాణాలు కలసివస్తాయి. నిరుద్యోగులు చాలాకాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు అందుకుంటారు. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాలు మీ పనితీరుతో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు.

సింహం:

ముఖ్యమైన పనులు వ్యయ ప్రయాసలతో కానీ పూర్తికావు. ఆర్థిక పరంగా ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. కుటుంబ సభ్యుల తో ఆకారణ వివాదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

కన్య:

ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఉన్నత హోదాలు పొందుతారు. చేపట్టిన పనులలో జాప్యం జరిగిన సకాలంలో పూర్తిచేస్తారు. స్థిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాల అందుకుంటారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

తుల:

వృత్తి ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో తొందరపాటు మంచిది కాదు. నిరుద్యోగులకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది.

వృశ్చికం:

కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. దైవ సేవకార్యక్రమాలు నిర్వహిస్తారు.వృత్తి, ఉద్యోగములు అంతంత మాత్రంగా సాగుతాయి. వ్యాపార వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది ధనపరంగాఒడిదుడుకులు ఉంటాయి.పనులు సకాలంలో పూర్తి కావు

ధనస్సు:

వాహన ప్రయాణ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. అకారణంగా ఇతరులతో వివాదాలు కలుగుతాయి. ఋణ సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగస్తులకు ఆకస్మిక స్థానచలన సూచనలు ఉన్నవి. సంతాన విద్యా విషయంలో దృష్టి సారించడం మంచిది. చేపట్టిన పనులలో ఆటంకాలుంటాయి.

మకరం:

కుటుంబ సభ్యుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. దీర్ఘ కాలిక ఋణాల వ్యవహారాలలో సన్నిహితుల సహాయం అందుతుంది. వృత్తివ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగమున అదనపు పనిభారం నుండి ఉపశమనం పొందుతారు. సామజిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

కుంభం:

సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు సద్దుమణుగుతాయి. విద్యార్థులు పరీక్షలలో ఉతీర్ణత సాధిస్తారు. ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది. వివాహాది శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి.

మీనం:

ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో స్వల్ప ఇబ్బందులయింటాయి. వ్యాపార పరంగా ఒత్తిడి తప్పదు. కుటుంబ పెద్దల సలహాతో నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు కొంత అనుకూలంగా సాగుతాయి. నూతన ఋణ యత్నాలు చేస్తారు.

Next Story