దిన ఫలితాలు: సన్నిహితులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు

ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగవుతుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.

By జ్యోత్స్న  Published on  23 July 2024 12:43 AM GMT
horoscope, astrology, Rasiphalalu

దిన ఫలితాలు: సన్నిహితులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు

మేషం:

భూ క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు అవరోధాలు తొలగుతాయి. సేవ కార్యక్రమాలు నిర్వహించి మీ విలువ మరింత పెంచుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతుల పెరుగుతాయి.

వృషభం:

కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. దీర్ఘకాలిక వివాదాలు నుండి కొంతవరకు బయట పడగలుగుతారు. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారుల నుండి విమర్శలు ఎదుర్కొంటారు.

మిధునం:

ఋణ దాతల ఒత్తిడి వలన మానసిక సమస్యలు కలుగుతాయి. కీలక వ్యవహారాలలో ఆలోచనలలో స్థిరత్వం లోపిస్తుంది. చేపట్టిన పనులు కొంత చాలాకష్టం మీద పూర్తి అవుతాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు.

కర్కాటకం:

సమాజంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. సంతాన విద్యా విషయాలు సంతృప్తి కలిగిస్తాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతిలో సాధిస్తారు. ఉద్యోగమున సహోద్యోగులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.

సింహం:

చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారములు అనుకున్న విధంగా పూర్తిచేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. వృత్తి వ్యాపారాలలో యత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి.

కన్య:

ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు మందగిస్తాయి. వృత్తి, వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. ఆర్ధిక వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.

తుల:

దూర ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. ఋణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటా బయట కొందరి ప్రవర్తన వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం నిరుత్సాహపరుస్తుంది.

వృశ్చికం:

సన్నిహితులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఉద్యోగమున అదనపు బాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు.

ధనస్సు:

ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు ఉంటాయి. నేత్ర సంభందిత ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ వాతావరణం కొంత గంధరగోళంగా ఉంటుంది. నూతన వ్యాపారవిస్తరణ ప్రయత్నాలు కలిసిరావు. ఉద్యోగమున అదనపు బాధ్యతలు చికాకు పరుస్తాయి.

మకరం:

సన్నిహితులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. చేపట్టిన వ్యవహారాలలో ఆకస్మిక విజయం సాధిస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో నూతన ఆలోచనలు ఆచరణలో పెట్టి లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన అవకాశములు అందుతాయి.

కుంభం:

దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో ఊహించని మార్పులు తప్పవు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. జీవిత భాగస్వామితో అకారణ వివాదాలు కలుగుతాయి. ఉద్యోగమున ప్రతికూల వాతావరణం ఉంటుంది. వృధా ఖర్చులు చేదాటుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.

మీనం:

ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగవుతుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. వృత్తి, వ్యాపారాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహం పొందుతారు.

Next Story