దిన ఫలాలు: నేడు ఈ రాశి ఉద్యోగస్థులకు పదోన్నతులు

వృత్తి వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు దక్కుతాయి. కుటుంబ సభ్యులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఉద్యోగస్థులకు పదోన్నతులు పెరుగుతాయి. పితృ వర్గయుల నుండి ధన సహాయం అందుతుంది.

By జ్యోత్స్న  Published on  22 Jan 2025 6:20 AM IST
horoscope, Astrology, Rasiphalalu

daily horoscope 22-01-2025

మేషం:

బంధువులతో ఏర్పడిన వివాదాలను పరిష్కారించుకొంటారు. ఉద్యోగాలలో ఆశించిన స్థానచలనాలు ఉంటాయి. ప్రారంభించిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ధనవ్యవహారాలు కలసివస్తాయి. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

వృషభం:

వృత్తి వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు దక్కుతాయి. కుటుంబ సభ్యులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఉద్యోగస్థులకు పదోన్నతులు పెరుగుతాయి. పితృ వర్గయుల నుండి ధన సహాయం అందుతుంది. భూ క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు.

మిధునం:

దూర ప్రాంతాల బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఇంటాబయట ఏర్పడిన చికాకులు కొంతవరకు తొలగుతాయి. సంతానానికి నూతన విద్యా, ఉద్యోగవకాశాలు లభిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం వాహనాల ప్రయాణాలలో తొందరపాటు పనిచేయదు.

కర్కాటకం:

ఉద్యోగాలలో అధికారులతో చర్చలు ఫలిస్తాయి. నూతన పనులకు శ్రీకారం చుట్టి సకాలంలో పూర్తి చేస్తారు. సోదరుల నుంచి ధన, వస్తులాభాలు పొందుతారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి.

సింహం:

కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కుటుంబ నభ్యులతో ఏర్పడిన విభేదాలను పరిష్కరించుకొంటారు. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. గృహనిర్మాణ ఆలోచనలలో మందకోడిగా సాగుతాయి. దూరప్రాంతాల నుంచి అందిన ఒక వార్త ఆనందం కలిగిస్తుంది.

కన్య:

విద్యార్థులకు నూతన విద్యావకాశాలు లభిస్తాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. బంధు మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు చెయ్యడం శ్రేయస్కరం.

తుల:

దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. బందు మిత్రులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు నిదానంగా పూర్తిచేస్తారు. భూ, క్రయ విక్రయాలలో స్వల్ప లాభాలు అందుతాయి.

వృశ్చికం:

నూతన మిత్రులు పరిచయాలు ఉత్సాహనిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. సోదరులతో భూవివాదాలు తీర ఒప్పందాలు కుదురుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు.

ధనస్సు:

ఉద్యోగాలలో అధికారులతో ఉన్న వివాదాలు సమసిపోతాయి. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన వ్యవహరాలలో దైర్యంగా ముందుకు సాగుతారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి.

మకరం:

నిరుద్యోగుల ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. జీవిత భాగస్వామి సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. చేపట్టిన పనులో జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో ఎదురైన సమస్యలు రాజి అవుతాయి.

కుంభం:

వ్యాపారాలలో విశేషమైన లాభాలు అందుకుంటారు. ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సహాయంతో పూర్తి చేస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో కీలక సమాచారం అందుకొంటారు.

మీనం:

కుటుంబ సభ్యులతో విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాలు పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. చేపట్టిన పనులలో యత్నకార్య సిద్ధి కలుగుతుంది. వివాదాలకు సంభందించి దూర ప్రాంత బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది.

Next Story