దిన ఫలాలు: నేడు ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాల్సిందే

నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. సంతానం నుండి శుభవార్తలు అందుతాయి. దైవదర్శనాలు చేసుకుంటారు.

By జ్యోత్స్న  Published on  21 Dec 2023 12:36 AM GMT
horoscope, Astrology, Rasiphalalu

దిన ఫలాలు: నేడు ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాల్సిందే

మేషం: నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. సంతానం నుండి శుభవార్తలు అందుతాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. పాతమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.

వృషభం: వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. ఇంటా బయట ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. బంధువులతో చిన్నపాటి వివాదాలు తప్పవు.

మిధునం: నూతన వాహనయోగం ఉన్నది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగులకు జీతాభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. గృహమున బంధు మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

కర్కాటకం: వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగుల కష్టం ఫలిస్తుంది. నూతన వ్యక్తుల పరిచయం ఉత్సాహనిస్తుంది. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనయోగం ఉన్నది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి.

సింహం: అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. నూతన రుణాలు చేస్తారు. వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. వ్యాపార, ఉద్యోగాలు చికాకు తప్పవు. కుటుంబ వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలసిరావు. బంధువులతో ఆకస్మిక తగాదాలు ఉంటాయి.

కన్య: నూతన రుణాలు చేస్తారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. కుటుంబ సమస్యలు వలన మానసిక ప్రశాంతత ఉండదు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఉద్యోగాలలో కొంత గందరగోళ పరిస్థితులుంటాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు తప్పవు.

తుల: ఉద్యోగమున ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు గతం కంటే మెరుగవుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

వృశ్చికం: దైవ సేవా కార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. ఇంటాబయట అనుకూల వాతావరణ ఉంటుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఆప్తుల నుండి కొత్త విషయాలు తెలుసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది.

ధనస్సు: చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. కుటుంబసభ్యులతో చిన్నపాటి విభేదాలు తప్పవు. దైవ చింతన పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు వలన నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

మకరం: సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ఉద్యోగాలలో అధికారుల నుండి విమర్శలు తప్పవు. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు.

కుంభం: వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు ఆశించిన విధంగా సాగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుకుంటారు.

మీనం: వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.

Next Story