దిన ఫలితాలు: నేడు ఈ రాశి వారికి వృత్తి వ్యాపారాలలో అడ్డంకులు
కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. మానసిక సమస్యలు అధికమవుతాయి. అవసరానికి డబ్బు లభించక ఇబ్బంది పడతారు. వృత్తి వ్యాపారాలలో అడ్డంకులు ఏర్పడతాయి.
By జ్యోత్స్న Published on 21 Nov 2024 6:04 AM ISTదిన ఫలితాలు: నేడు ఈ రాశి వారికి వృత్తి వ్యాపారాలలో అడ్డంకులు
మేషం:
ఇంట బయట ఒత్తిడి పెరుగుతుంది. అనారోగ్య సమస్య బాధిస్తాయి. ఇతరుల వలన విరోధం పెరుగుతుంది. విలువైన వస్తువులు విషయంలో జాగ్రత్త వహించాలి. వృత్తి ఉద్యోగాలలో పనిభారం పెరుగుతుంది. సంతాన విద్యా సంబంధిత విషయాలలో సమస్యలు కలుగుతాయి.
వృషభం:
కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. మానసిక సమస్యలు అధికమవుతాయి. అవసరానికి డబ్బు లభించక ఇబ్బంది పడతారు. వృత్తి వ్యాపారాలలో అడ్డంకులు ఏర్పడతాయి. ఉద్యోగమున శత్రు సంభందమైన ఇబ్బందులు కలుగుతాయి.
మిధునం:
విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. అన్ని వైపులా నుండి ధన లాభం అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం నుండి ఉపశమనం పొందుతారు. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుతాయి.
కర్కాటకం:
ఆర్ధిక ఇబ్బందులు కలుగుతాయి. సౌకర్యాలకు ఇబ్బంది లేకున్నా ఇతరుల వలన ఇబ్బందులుంటాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. నేత్ర సంభందిత అనారోగ్య సమస్యలు భాధిస్తాయి. వృత్తి ఉద్యోగాలు చికాకు పెరుగుతాయి.
సింహం:
సమాజంలో ప్రముఖులతో పరిచయాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో దీర్ఘకాలిక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఇంట బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. సంతాన విద్యా విషయాలు అనుకూలంగా సాగుతాయి.
కన్య:
ఇంటబయట నూతన సమస్యలు కలుగుతాయి. చేపట్టిన శ్రమాధిక్యతతో కానీ పనులు పూర్తి కావు. మానసిక సమస్యలు భాధిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా పడతాయి వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగమున అదనపు భాద్యతలు ఉంటాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
తుల:
వృత్తి ఉద్యోగాలలో కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. సమాజంలో పెద్దల నుండి సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. రావలసిన బాకీలు వసూలవుతాయి. వ్యాపార లాభసాటిగా సాగుతాయి. ముఖ్యమైన పనులలో బందు మిత్రులసహకారం లభిస్తుంది. ఆర్ధిక అనుకూలత కలుగుతుంది.
వృశ్చికం:
అధికారులతో చర్చలకు అనుకూల సమయం. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు అందుతాయి. వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. గృహోప కరణాలు కొనుగోలు చేస్తారు. పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. జీవిత భాగస్వామి నుండి ధన సహాయం లభిస్తుంది.
ధనస్సు:
దూర ప్రయాణాల వలన అలసట పెరుగుతుంది. కుటుంబమున చికాకులు అధికమవుతాయి. సోదరులు తో స్ధిరాస్తి వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. విద్యార్థుల కష్టానికి తగిన ఫలితం ఉండదు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన విశ్రాంతి లభించదు.
మకరం:
వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. వాహన ప్రయాణాలలో ప్రమాద సూచనలు ఉన్నవి. చేపట్టిన పనులలో సమయానికి పూర్తికావు నిరుత్సాహం పెరుగుతుంది. ఆర్ధిక నష్టములు ఉంటాయి. ఉద్యోగమున చెయ్యని పనికి అధికారుల నుండి నిందలు పడతారు.
కుంభం:
చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. విందు వినోదాది కార్యక్రమాలలో హాజరు అవుతారు. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. వృత్తి వ్యాపారాలు మరింత అభివృద్ధి కలుగుతుంది.
మీనం:
నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. అన్ని వైపుల నుండి అదాయం ఉంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో కష్టానికి తగిన ప్రతిఫలం అందుతుంది. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. సమాజంలో పెద్దల ఆదరణ పొందుతారు.