ఈ రాశి ఉద్యోగ‌స్తుల‌కు నేడు లాభ‌దాయకం

బంధు మిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.

By జ్యోత్స్న  Published on  21 March 2023 1:52 AM GMT
ఈ రాశి ఉద్యోగ‌స్తుల‌కు నేడు లాభ‌దాయకం

మేషం : బంధు మిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో దూర ప్రయాణాలు సూచనలు ఉన్నవి. వృత్తి వ్యాపారాలు ఆశించిన స్థాయిలో ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు దక్కుతాయి.

వృషభం : కుటుంబ సభ్యుల ప్రవర్తన శిరోబాధ కలిగిస్తాయి. ముఖ్యమైన పనులలో అవరోధాలు కలుగుతాయి. వ్యాపారాలలో శ్రమధిక్యత పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి సమస్యలు తప్పవు. మిత్రులతో కలహాల సూచనలున్నవి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి.

మిధునం : నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాల పరంగా ఇబ్బందులు అధిగమించి లాభాలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రులతో పాత జ్ఞాపకాలు పంచుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి.

కర్కాటకం : గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. నిరుద్యోగులకు చాలాకాలంగా ఎదురు చూస్తున్న అవకాశములు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సన్నిహితుల నుండి కీలక విషయాలు తెలుస్తాయి.

సింహం : ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. చేపట్టిన పనులందు కార్యాటంకములు తప్పవు. వ్యాపారాలు కొంత మందకోడిగా సాగుతాయి. ఉద్యోగస్థులకు స్థానచలనాలుంటాయి. ఇంటాబయట సమస్యలు చికాకు పరుస్తాయి. దైవ సంబంధిత కార్యక్రమాలలో ఆసక్తిగా పాల్గొంటారు.

కన్య : కుటుంబ సభ్యులతో మాటపట్టింపులుంటాయి. ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులుంటాయి .వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు కలుగుతాయి. సంతాన విద్యా విషయాలలో కొంత శ్రద్ద వహించాలి.

తుల : రాజకీయ సభ సమావేశములకు ఆహ్వానాలు అందుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు. సంతాన శుభకార్య విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి,ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆర్థిక పురోగతి కలుగుతుంది. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి.

వృశ్చికం : వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. మిత్రులతో విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. ప్రముఖులతో కొత్త పరిచయాలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. సోదరులతో స్ధిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు.

ధనస్సు : పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. దూరప్రయాణాలలో అవరోధాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధికమౌతాయి. బంధు మిత్రుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది.

మకరం : ధన సంబంధిత వ్యవహారాలలో ఆలోచనలు స్థిరత్వంగా ఉండవు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం వలన ఆర్ధిక నష్టాలు తప్పవు. నిరుద్యోగ యత్నాలు మందగిస్తాయి. బంధు మిత్రులతో కీలక వ్యవహారాలు చర్చిస్తారు.

కుంభం : ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో అదనపు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి అధికారులనుండి ప్రశంసలు పొందుతారు. దైవ సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభిస్తాయి.

మీనం : దాయాదులతో ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. గృహ నిర్మాణ పనులు వాయిదా వేస్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి,వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. దైవ చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులందు శ్రమ అధికమౌతుంది. ఇతరులతో ఆకారణంగా విబేదిస్తారు.

Next Story