దిన ఫలాలు: నేడు ఈ రాశి వారు ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం ఉత్తమం

ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. వాహన ప్రయాణాలు వాయిదా పడుతాయి. వ్యాపారమున భాగస్థులతో జాగ్రత్తగా మాట్లాడటం మంచిది. దూర ప్రాంతాల బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

By జ్యోత్స్న  Published on  20 Dec 2024 12:54 AM GMT
horoscope, Astrology, Rasiphalalu

దిన ఫలాలు: నేడు ఈ రాశి వారు ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం ఉత్తమం

మేషం:

ఆరోగ్యం విషయంలో చికాకులు తప్పవు. వాహనాలు ప్రయాణ విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగులకు నూతన సమస్యలు కలుగుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు మధ్య స్వల్ప విభేదాలు ఉంటాయి. ఆర్ధిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది.

వృషభం:

అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. దైవ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆర్ధిక పరిస్థితి అనుకూలిస్తుంది. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది. నూతన కార్యక్రమాల ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి.

మిధునం:

గృహమున పెద్దల ఆరోగ్య విషయం ఆందోళన కలిగిస్తుంది. ప్రయాణాలు వాయిదా వెయ్యడ మంచిది. ఇతరులకు ధన వ్యవహారాలలో మాట ఇవ్వకపోవడం మంచిది. వ్యాపారమున ఎంతగా శ్రమించినా ఫలితం లభించక నిరాశ కలుగుతుంది. బంధువులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి.

కర్కాటకం:

వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆర్ధిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. నూతన ఆలోచనలు అమలు చేస్తారు. ప్రారంభించిన పనులు నిదానంగా సాగుతాయి. మొండి బాకీలు తీర్చగలుగుతారు.

సింహం:

నూతన ఉద్యోగ అవకాశములు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు కలసివస్తాయి. విలువైన వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగమున అధికారుల అనుగ్రహం కలుగుతుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

కన్య:

వృధా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. రాజకీయ సభ సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. ఆర్ధిక పరిస్థితి కొంత వరకు అనుకూలిస్తుంది. ఉద్యోగ విషయమై అధికారులతో చర్చలు అంతగా అనుకూలించవు. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి.

తుల:

ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. వాహన ప్రయాణాలు వాయిదా పడుతాయి. వ్యాపారమున భాగస్థులతో జాగ్రత్తగా మాట్లాడటం మంచిది. దూర ప్రాంతాల బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

వృశ్చికం:

దాయాదులతో వివాదాలకూ దూరంగా ఉండటం మంచిది. చేపట్టిన పనులలో జాప్యం కలిగిన సకాలంలో పూర్తి చేస్తారు. బంధు మిత్రుల ప్రవర్తన కొంత చికాకు పరుస్తుంది. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగమున కొంత అనుకూలత కలుగుతుంది. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి.

ధనస్సు:

ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. నిరుద్యోగులు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. వృత్తి ఉద్యోగమున ఆశించిన స్థానచలనాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో సంఖ్యతగా వ్యవహారిస్తారు. ప్రయాణాలలో కొంత జాగ్రత్త అవసరం పాత ఋణాలు వసూలవుతాయి.

మకరం:

నిరుద్యోగులకు కీలక సమాచారం అందుతుంది. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. స్ధిరాస్తి క్రయ విక్రయాలు వాయిదా పడుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులకు అదనపు పని బాధ్యతలు చికాకు కలిగిస్తాయి.

కుంభం:

శత్రువులు సైతం మిత్రులుగా మరి సహాయ పడతారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి తెలివిగా బయటపడతారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సజావుగా సాగుతాయి.

మీనం:

నూతన కార్యక్రమాలు ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. సోదరుల నుంచి కీలక సమాచారం అందుతుంది. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. వృత్తి, వ్యాపారాలలో ఎదురైనా సమస్యలు తెలివిగా అధిగమిస్తారు. సమాజంలో ప్రముఖుల పరిచయాలు ఉత్సహాన్నిస్తాయి.

Next Story