దిన ఫలితాలు: నేడు ఈ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి

సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అనుకున్న పనులు సమయానికి పూర్తి అవుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ధన సంబంధిత విషయాలు సంతృప్తి కరంగా సాగుతాయి. వ్యాపారాలలో భాగస్థుల నుండి ఆశించిన సహాయం అందుతుంది.

By జ్యోత్స్న  Published on  20 Nov 2024 6:00 AM IST
horoscope, Astrology, Rasiphalalu

దిన ఫలితాలు: నేడు ఈ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి 

మేషం:

చేపట్టిన పనులు కష్టసాద్యంతో పూర్తవుతాయి. స్ధిరాస్తి వ్యవహారాలలో పెద్దలతో వివాదాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారుల కోపానికి గురి అవుతారు. ప్రయాణాలు వాయిదా పడతాయి. సంతాన విద్యా ప్రయత్నాలు వృధాగా మిగులుతాయి.

వృషభం:

ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు కలసి వస్తాయి. అవసరానికి ఇతురుల సహాయం అందుతుంది. సోదరులతో మనస్పర్ధలు తొలగుతాయి. గృహ వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగపరంగా స్వంత నిర్ణయాలు అమలు పరచడం మంచిది.

మిధునం:

నేత్ర సంభందిత అనారోగ్య సమస్యలు కలుగుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థికంగా ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. నూతన వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు అధికారుల నుండి సమస్యలు ఉంటాయి.

కర్కాటకం:

సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అనుకున్న పనులు సమయానికి పూర్తి అవుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ధన సంబంధిత విషయాలు సంతృప్తి కరంగా సాగుతాయి. వ్యాపారాలలో భాగస్థుల నుండి ఆశించిన సహాయం అందుతుంది. వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

సింహం:

చేపట్టిన పనుల యందు జాప్యం కలుగుతుంది. వ్యాపారాలలో నూతన సమస్యలు కలుగుతాయి. ఆదాయం కన్నా ఖర్చు అధికమౌతుంది. ఋణదాతల ఒత్తిడి పెరుగుతుంది. ఉదర సంబంధ అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

కన్య:

ఆర్ధిక లాభం కలుగుతుంది. గృహమున శుభకార్య విషయంపై ప్రస్తావన వస్తుంది. సంఘంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తాయి. బంధు మిత్రుల సహాయం అందుతుంది. ఉద్యోగ విషయాలు అనుకూలిస్తాయి.

తుల:

శ్రమకు తగిన ఫలితం పొందుతారు. వృత్తి వ్యాపారాలలో స్వంత ఆలోచనలతో చెయ్యడం మంచిది. ఉద్యోగమున సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపార వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఇంటాబయటా అనుకూల వాతావరణం ఉంటుంది. బంధువులలో స్వల్ప వివాదాలు ఉంటాయి.

వృశ్చికం:

కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోతాయి. ఇతరుల మాటల వలన మానసిక అశాంతి కలుగుతుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు విఫలమౌతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

ధనస్సు:

ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. సంతాన వ్యవహారాలు సమస్యాత్మకంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. విద్యార్దులు మరింత కష్టపడాలి ఉద్యోగాలలో బాధ్యతలు మరింత అధికమౌతాయి. వృధా ఖర్చులు చేస్తారు.

మకరం:

ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం మంచిది. ప్రభుత్వ అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. సంతాన విద్యా వ్యవహారాలలో అనుకూలత కలుగుతుంది. ప్రయాణాలలోనూతనపరిచయాలు కలుగుతాయి. ఉద్యోగమున ఉన్నత పదవులు పొందుతారు.

కుంభం:

ధన పరమైన ఆలోచనలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. బంధు మిత్రులతో సఖ్యత కలుగుతుంది. వ్యాపారాలలో శత్రు సమస్యలు నుండి బయటపడతారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది.

మీనం:

వివేచన జ్ఞానంతో ముందుకు సాగుతారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగమున అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. వ్యాపారాలు లాభిస్తాయి. సంతానం నుండి శుభ వార్తలు అందుతాయి.

Next Story