దిన ఫలాలు: నేడు ఈ రాశివారి కుటుంబ వాతావరణం గందరగోళం
దూరప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా వేస్తారు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. దీర్ఘ కాలిక రుణ ఒత్తిడి అధికమవుతుంది.
By అంజి Published on 20 July 2024 12:52 AM GMTదిన ఫలాలు: నేడు ఈ రాశివారి కుటుంబ వాతావరణం గందరగోళం
మేషం: సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. దైవ అనుగ్రహం తో వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు.
వృషభం: వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు. చిన్ననాటి మిత్రులతో మాట పట్టింపులు కలుగుతాయి. దాయాదులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగ ప్రయత్నములు అంతగా అనుకూలించవు.
మిధునం: ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. ఇంటాబయట ఊహించని చికాకులు పెరుగుతాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తప్పవు.
కర్కాటకం: ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుకుంటారు. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి.
సింహం: సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. మంచి మాట తీరుతో ఇంటాబయట అందరినీ ఆకట్టుకుంటారు. సమాజంలో పెద్దల నుండి ప్రశంసలు పొందుతారు. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.
కన్య: దూరప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా వేస్తారు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. దీర్ఘ కాలిక రుణ ఒత్తిడి అధికమవుతుంది. పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది.
తుల: బంధు మిత్రులతో ఊహించిన మాటపట్టింపులు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు వలన నూతన ఋణప్రయత్నాలు చేస్తారు. చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసలు తప్పవు ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి.
వృశ్చికం: నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం ఉన్నది. ప్రణాళికలతో అనుకున్న పనులను పూర్తిచేస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఒక వ్యవహారంలో దూరప్రాంత బంధుమిత్రుల నుంచి కీలక సమాచారం సేకరిస్తారు. వ్యాపారాలలో ఉత్సాహంతో ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.
ధనస్సు: వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. బంధువులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. కొన్ని వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. దైవదర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగాలలో అధికారులతో చర్చలు అంతగా అనుకూలించవు.
మకరం: ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. సంతానం పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు అంచనాలు అందుకుంటారు.
కుంభం: ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ముఖ్యమైన పనులు వాయిదా వేయుట మంచిది. దూర ప్రయాణం సూచనలు ఉన్నవి. ఇంటాబయట చికాకులు పెరుగుతాయి. సోదరులతో స్థిరస్తి వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు మందగిస్తాయి.
మీనం: ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. సన్నిహితుల నుంచి అవసరానికి ధనసహాయం అందుతుంది. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలకు నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగమున అధికారుల అనుగ్రహంతో హోదాలు పెరుగుతాయి.