దిన ఫలాలు: నేడు వీరికి శ్రమ తప్ప ఫలితం కనిపించదు

ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది.

By జ్యోత్స్న  Published on  20 March 2024 6:12 AM IST
horoscope, Astrology, Rasiphalalu

దిన ఫలాలు: నేడు వీరికి శ్రమ తప్ప ఫలితం కనిపించదు

మేషం: చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. బంధు మిత్రుల నుండి విలువైన సమాచారం అందుతుంది. గృహమున కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

వృషభం: ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగస్తులు అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.

మిధునం: నూతన రుణయత్నాలు చెయ్యవలసి వస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. బంధు మిత్రుల నుండి ఊహించని మాటలు వినవలసివస్తుంది. ఉద్యోగులకు స్థానచలన సూచనలున్నవి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

కర్కాటకం: ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నూతన గృహ నిర్మాణానికి శ్రీకారం చుడతారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. సోదరులతో సఖ్యత కలుగుతుంది.

సింహం: వృధా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలలో నూతన సమస్యలు ఉత్పన్నమవుతాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు అధికారుల నుండి విమర్శలు తప్పవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆదాయ మార్గాలు మందగిస్తాయి.

కన్య: కుటుంబ వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలసివస్తాయి. స్నేహితుల సహాయంతో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు తగిన అవకాశములు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

తుల: ప్రయాణాలలో మార్గవరోదాలు కలుగుతాయి. విద్యార్థులు ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలుంటాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు చోటుచేసుకుంటాయి. స్ధిరాస్తి వివాదాలుంటాయి కొంత చికాకు పరుస్తాయి. మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

వృశ్చికం: గృహ నిర్మాణ ప్రారంభానికి శ్రీకారం చుడతారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు గతంకంటే మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు అందుతాయి. గృహ వాతావరణం సంతోషంగా ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

ధనస్సు: ఆర్థిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది. కుటుంబ సభ్యులతో కీలక విషయాలు చర్చిస్తారు. భూ కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో సకాలంలో నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులు దీర్ఘకాలిక సమస్యలు నుండి బయటపడతారు.

మకరం: ఇంటా బయట గందరగోళ పరిస్థితులుంటాయి. ఆర్ధిక సమస్యలు మరింత భాదిస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యడం మంచిది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వృత్తి ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుని నష్టపడతారు.

కుంభం: ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించడం మంచిది. వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉండక నూతన రుణయత్నాలు చెయ్యవలసి వస్తుంది. అనుకున్న సమయానికి పనులు పూర్తికాక చికాకు పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఆకస్మిక స్థాన చలన సూచనలున్నవి.

మీనం: చేపట్టిన పనులలో ఆకస్మిక విజయం సాధిస్తారు. చాలాకాలంగా పూర్తికాని పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్థులకు అనుకూల వాతావరణం ఉంటుంది.

Next Story