దిన ఫలాలు: నేడు వీరికి అన్నివైపుల నుండి ఆదాయం

బంధువులనుండి వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వాహన ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.

By జ్యోత్స్న  Published on  20 Feb 2024 12:48 AM GMT
horoscope, Astrology, Rasiphalalu

దిన ఫలాలు: నేడు వీరికి అన్నివైపుల నుండి ఆదాయం

మేషం: బంధువులనుండి వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వాహన ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. చేపట్టిన పనులులో జాప్యం కలుగుతుంది. విద్యా విషయాలు నిరాశ కలిగిస్తాయి.

వృషభం: అన్నివైపుల నుండి ఆదాయం అందుతుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఉంటుంది. నూతన వస్త్రా వస్తు లాభాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. వాహన యోగం ఉన్నది. సంతాన విద్యా ఉద్యోగ విషయాల శుభవార్తలు అందుతాయి.

మిధునం: వృత్తి వ్యాపారాలలో సరైన నిర్ణయం తీసుకోలేరు. మానసికంగా ఆలోచనలు ఇబ్బందికి గురిచేస్తాయి. ఆధ్యాత్మిక,సేవా కార్యక్రమాలలో చిన్ననాటి మిత్రులతో పాల్గొంటారు. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృధా ఖర్చులు చేదాటిపోతాయి.

కర్కాటకం: వృత్తి వ్యాపారాలలో దైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. ఉద్యోగమున నూతన అవకాశములు అందుతాయి. నిరుద్యోగుల కష్టం ఫలిస్తుంది. కుటుంబ విషయంలో నూతన ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్ధిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది.

సింహం: వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభించదు. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. కుటుంబమున కొంతమంది ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలసిరావు. భాగస్వామ్య వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

కన్య: వృత్తి, ఉద్యోగాలలో ఉన్నత పదవులు పొందుతారు. ఆర్థిక పరమైన చిక్కులు నుండి బయటపడతారు. వ్యాపారాలు అంచనాలను దాటి లాభాలు అందుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులను పూర్తిచేస్తారు.

తుల: బంధు మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసంతో పూర్తిచేస్తారు. ధనపరంగా ఇబ్బందులను అధిగమించి ఋణాలు సైతం తీర్చగలుగుతారు. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

వృశ్చికం: వృత్తి ఉద్యోగాలలో మేలైన సౌకర్యాలను పొందుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు విశేషంగా పాల్గొంటారు. వ్యాపారాలు అనుకూలిస్తాయి. నూతన ఉద్యోగ అవకాశాలు అందుతాయి. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

ధనస్సు: అనుకున్న సమయానికి పనులు పూర్తికావు. శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధు మిత్రులతో చిన్న చిన్న తగాదాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇతరులపై మీ ఆలోచనా విధానం మార్చుకోవడం మంచిది.

మకరం: ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. నూతన వస్తు వాహన సౌకర్యాలు లభిస్తాయి. ఆర్థిక పరంగా చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దూర ప్రయాణ సూచనలున్నవి. ధనదాయం పెరుగుతుంది బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది.

కుంభం: సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో పెద్దల సలహాలను తీసుకోవడం మంచిది. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు.

మీనం: ప్రారంభించిన పనులు మందకొడిగా సాగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఉద్యోగ వాతావరణం సమస్యాత్మకంగా ఉండి శిరో బాధలు పెరుగుతాయి. ధన విషయాలలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు.

Next Story