దిన ఫలాలు: నేడు ఈ రాశుల వారికి ఎలా ఉందంటే?

నిరుద్యోగులకు చాలకాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన అభివృద్ధి కలుగుతుంది.

By జ్యోత్స్న  Published on  20 Jan 2025 6:37 AM IST
horoscope, Astrology, Rasiphalalu

దిన ఫలాలు: నేడు ఈ రాశుల వారికి ఎలా ఉందంటే?

మేషం:

నిరుద్యోగులకు చాలకాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన అభివృద్ధి కలుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబసభ్యులతో సంతోషంగా గడుపుతారు.

వృషభం:

వ్యాపారాలలో భాగస్వాములతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. దూరప్రయాణాలు వీలైనంత వరకు వాయిదా వేయడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో ఊహించని వివాదాలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. గృహనిర్మాణ ఆలోచనలు మందకొడిగా సాగుతాయి.

మిధునం:

విలువైన వస్తువులు బహుమతులు పొందుతారు. పాత రుణాలు తీరి ఊరట చెందుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది.

కర్కాటకం:

దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు సేకరిస్తారు. కుటుంబంలో సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. భూ సంబంధిత క్రయవిక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.

సింహం:

గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. భాగస్వామ్య వ్యాపారాలను విస్తరిస్తారు. సంతాన విద్య ఉద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కన్య:

చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో ఎదురైన ఆటంకాలను అధిగమించి ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగులకు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలకు నూతన పెట్టుబడులు అందుతాయి. సోదరుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

తుల:

ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. బంధువులతో ఏర్పడిన వివాదాలు రాజిచేసుకుంటారు. ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. కొన్ని వ్యవహారాలలో సోదరుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి.

వృశ్చికం:

గృహ నిర్మాణ ఆలోచనలు ఫలిస్తాయి. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. సంతానానికి నూతన విద్యావకాశాలు దక్కుతాయి. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో సామాజిక, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

ధనస్సు:

చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తిచేస్తారు. అరుదైన ఆహ్వానాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగులకు అధికారుల సహాయం లభిస్తుంది. ఆకస్మిక ధన, వస్తులాభాలు పొందుతారు.

మకరం:

వ్యాపారాలలో పెట్టిన పెట్టుబడులకు తగిన లాభాలు అందుకుంటారు. రుణ బాధల నుంచి బయటపడతారు. నూతన వ్యక్తుల పరిచయాలు భవిష్యత్కు ఉపయోగపడతాయి. గృహనిర్మాణ ఆలోచనలు మందకోడిగా సాగుతాయి. దూర ప్రాంతాల నుంచి అందిన వార్త సంతోషాన్నిస్తుంది.

కుంభం:

విలువైన వస్త్రా, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరానికి ధన సహాయం అందుతుంది. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. బంధువుల నుంచి అందిన ఆహ్వానాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు కలసివస్తాయి.

మీనం:

వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఆర్ధిక లావాదేవీలు ఉత్సాహనిస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు.

Next Story