దిన ఫలాలు: నేడు కన్య రాశి వారికి ఎలా ఉందంటే?

కొన్ని వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. దైవ సేవా కార్యక్రమాలకు ధనసహాయం అందిస్తారు.

By జ్యోత్స్న  Published on  19 Sep 2023 12:43 AM GMT
horoscope, Astrology, Rasiphalalu

దిన ఫలాలు: నేడు కన్య రాశి వారికి ఎలా ఉందంటే?

మేషం: ఇంటా బయట పని ఒత్తిడులు పెరుగుతాయి. ఆదాయ మార్గాలు తగ్గుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమానంతరం పనులు పూర్తి అవుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసిరావు. జీవిత భాగస్వామితో వివాదాలు కలుగుతాయి.

వృషభం: చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వ్యాపారానికి పెట్టుబడులు అందుతాయి. స్థిరస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

మిధునం: సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలు చేపడతారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఆర్థిక పురోగతి కలుగుతుంది.

కర్కాటకం: పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఇంటాబయటా గందరగోళ పరిస్థితులుంటాయి. మిత్రులతో కలహాలు సూచనలు ఉన్నవి. వృత్తి, వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలి.

సింహం: ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. మిత్రులతో దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. ధన పరంగా ఇతరులకు మాట ఇవ్వటం మంచిది కాదు.

కన్య: దూరపు బంధువులు కలుసుకుని పాత విషయాలు చర్చిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

తుల: ఆర్థిక అనుకూలత పెరుగుతుంది. గృహమున కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. సోదరుల నుండి శుభవార్తలు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

వృశ్చికం: వృథా ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగ విషయంలో కొంత ఒత్తిడి తప్పదు.

ధనస్సు: కొన్ని వ్యవహారాలు శ్రమతో గాని పూర్తి కావు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

మకరం: చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరస్తి వివాదానికి సంబంధించి విలువైన సమాచారం అందుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు చకచకా సాగుతాయి. అధికారుల సహాయంతో పదోన్నతులు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి.

కుంభం: ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. కీలక వ్యవహారాలలో స్వల్ప అవరోధాలు కలుగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో సహోద్యోగుల ప్రవర్తన మానసిక బాధను కలిగిస్తుంది.

మీనం: కొన్ని వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. దైవ సేవా కార్యక్రమాలకు ధనసహాయం అందిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు ఆర్థికంగా పురోగతి కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

Next Story