దిన ఫలాలు: ఈ రాశి వారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి

అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉండదు. ఋణ ప్రయత్నాలు కలిసి రావు. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి.

By జ్యోత్స్న  Published on  19 May 2023 6:30 AM IST
horoscope, astrology, Rasiphalalu

దిన ఫలాలు: ఈ రాశి వారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి

మేషం: ఇంట బయట గౌరవం పెరుగుతుంది. నూతన వస్తు లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు తీసుకుంటారు. పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తిగా సాగుతాయి. దైవ చింతన కలుగుతుంది.

వృషభం: దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. కొన్ని విషయాలలో కుటుంబ సభ్యుల ప్రవర్తన విసుగు కలిగిస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సన్నిహితులతో అకారణ వివాదాలు కలుగుతాయి. అనవసర వస్తువులపై ధన వ్యయం చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన రీతిలో పనులు పూర్తికావు.

మిధునం: విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ధనాదాయ మార్గాలు మరింత విస్తరిస్తాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

కర్కాటకం: ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలకు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేసి లాభాలను అందుకుంటారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది.

సింహం: బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. చివరి నిమిషంలో ప్రయాణాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనులు మధ్యలో నిలుస్తాయి. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించిన లేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. వ్యాపారాలు మందగిస్తాయి.

కన్య: చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థికంగా ఒత్తిడి పెరుగుతుంది. వాహన ప్రయాణ విషయంలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. నూతన ఋణప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఒడిదుడుకులు పెరుగుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

తుల: చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. కీలక వ్యవహారాల్లో జీవితభాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. విద్యా అనుకూలత కలుగుతుంది.

వృశ్చికం: సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. శత్రుసమస్యలు నుండి ఉపశమనం కలుగుతుంది. అప్రయత్నంగా పనులు పూర్తవుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ధన విషయాల్లో సోదరులతో వివాదాలు సర్దుమణుగుతాయి. వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

ధనస్సు: సన్నిహితులతో తగాదాలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. సంతానం విద్యా ఫలితాలు లభిస్తాయి. దూరప్రాంత ప్రయాణ సూచనలున్నవి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు కలుగుతాయి.

మకరం: ఋణ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. దూరప్రయాణాల వలన శ్రమ పెరుగుతుంది. బంధు వర్గం నుండి వినకూడని మాటలు వినవలసి వస్తుంది. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. వ్యాపారాలలో కొత్త సమస్యలు కలుగుతాయి. ఉద్యోగమున ప్రతికూల పరిస్థితులుంటాయి.

కుంభం: కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. సోదరవర్గం వారితో సఖ్యత పెరుగుతుంది. ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. దైవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. భూ క్రయ విక్రయాల లాభిస్తాయి.

మీనం: అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉండదు. ఋణ ప్రయత్నాలు కలిసి రావు. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. గృహమున గందరగోళ వాతావరణం ఉంటుంది. వ్యాపార ఉద్యోగాలలో ఊహించిన సమస్యలను ఎదుర్కొంటారు. ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి.

Next Story