దిన ఫలాలు: నేడు వీరికి ఆకస్మిక ధనలాభ సూచనలు
ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాల గురించి చర్చిస్తారు. దీర్ఘకాలిక వివాదాలను పరిష్కరించుకుంటారు.
By జ్యోత్స్న Published on 19 March 2024 6:11 AM ISTదిన ఫలాలు: నేడు వీరికి ఆకస్మిక ధనలాభ సూచనలు
మేషం: వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. ముఖ్యమైన పనులలో తొందరపాటు నిర్ణయాలు పనిచేయవు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలలో నూతన సమస్యలు కలుగుతాయి.
వృషభం: చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. దీర్ఘకాలిక రుణాలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఒడిదుడుకులు అధికమౌతాయి. ఉద్యోగ వాతావరణం నిరుత్సాహపరుస్తుంది. సన్నిహితుల నుండి కీలక సమాచారం సేకరిస్తారు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం.
మిధునం: ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సోదరులతో సఖ్యత కలుగుతుంది. ముఖ్యమైన వ్యవహారంలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.
కర్కాటకం: చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం ఉండదు. ప్రయాణమున మార్గావరోధాలు కలుగుతాయి. చిన్ననాటి మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. నూతన రుణాలు చేయవలసి వస్తుంది. వృత్తి ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.
సింహం: బంధు మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. స్థిరాస్తి వృద్ధి కలుగుతుంది. ఉద్యోగాల్లో హోదాలు పెరుగుతాయి.
కన్య: కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది. చేపట్టిన పనులు సమయానికి పూర్తి కావు. దూర ప్రాంత బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగులకు ఆశించిన ఫలితాలు ఉండవు. ఆదాయం మార్గాలు గంధరగోళంగా ఉంటాయి. దైవ సేవా కార్యక్రమాల పై ఆసక్తి పెరుగుతుంది.
తుల: జీవిత భాగస్వామితో దూరప్రాంత ప్రయాణాలు చేస్తారు. గృహమున సంతోషకర వాతావరణం ఉంటుంది. గృహమున కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. మొండి బాకీలు వసూలవుతాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
వృశ్చికం: ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాల గురించి చర్చిస్తారు. దీర్ఘకాలిక వివాదాలను పరిష్కరించుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
ధనస్సు: సన్నిహితుల నుండి ఋణ ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపార సంబంధిత వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగ, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. దైవ చింతన పెరుగుతుంది.
మకరం: ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. చేపట్టిన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు చికాకు కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ప్రతికూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగాలలో నూతన సమస్యలు కలుగుతాయి.
కుంభం: ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. నూతన వాహన యోగం ఉన్నది. సంతాన విద్యా విషయాలు సంతృప్తి కలిగిస్తాయి. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగమున ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
మీనం: శత్రువులకు సైతం సహాయ సహకారాలు అందిస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు లభిస్తాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగములో సమస్యలు తొలగి అధికారుల ఆదరణ పెరుగుతుంది.